వీరంతా సక్సెస్ ఫుల్ సినిమాలు అందించే స్టార్ డైరెక్టర్స్ గా పేరు పొందారు. వీరందించిన సినిమాలతో కొంతమంది కొత్త హీరోలు, హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లతో కొనసాగుతున్నారు. అలాంటి స్టార్ డైరెక్టర్లు సూపర్ హిట్ సినిమాలను అందించి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మళ్లీ వారి నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రావడం లేదు.. మరి వారిలో కొంతమంది గురించి మనం ఇప్పుడు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు శ్రీనువైట్ల. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో వరుసగా చిత్రాలు చేశారు. కానీ ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. 2018లో మంచు విష్ణు తో శ్రీను వైట్ల ఢీ సినిమా సీక్వెల్ గా ఢీ అంటే ఢీ అనే సినిమాని ప్రకటించారు. కానీ ఈ మూవీ ఇప్పటి కూడా సెట్స్ మీదకు వెళ్లలేదు.
శ్రీకాంత్ అడ్డాల : నిజమైన ప్రేమ కథకు కేరాఫ్ అడ్రస్ శ్రీకాంత్ అడ్డాల. ఆయన డైరెక్షన్ చేసిన నారప్ప ఓటీటీ లో రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చి నెలలు గడుస్తున్నా మరో ప్రాజెక్టు పై క్లారిటీ ఇవ్వలేదు. సంతోష్ శ్రీనివాస్.. కందిరీగ, రభస, అల్లుడు అదుర్స్ వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ 2021 జనవరి 15న వచ్చింది . ఇక అప్పటి నుంచి ఈ డైరెక్టర్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. యువ దర్శకుడు సుజిత్ : ఈ దర్శకుడి మొదటి చిత్రం రన్ రాజా రన్ సూపర్ హిట్ అయింది. దీంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుజిత్ ప్రభాస్ తో సాహో సినిమా చేశారు. ఈ మూవీ 2019 ఆగస్టు 30న రిలీజ్ అయింది.. ఈ మూవీ విడుదల అయ్యాక సుజిత్ నుంచి ఎలాంటి సినిమా క్లారిటీ రాలేదు.
బుచ్చిబాబు : ఉప్పెన సినిమాతో ఉప్పెన లాగా దూసుకొచ్చారు బుచ్చిబాబు. తన మొదటి చిత్రం ఉప్పెన తో హిట్ కొట్టారు.. ఈ సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 2021 ఫిబ్రవరి 12న ఈ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా చేసిన ఆ హీరో హీరోయిన్లు బిజీ గా మారిపోయారు. కానీ అప్పటినుంచి బుచ్చిబాబు నుండి ఎలాంటి సినిమా విడుదల కాలేదు.