వినోదం

Uday Kiran : ఆ రోజుల్లోనే రూ.1 కోటి రెమ్యునరేషన్ అందుకున్న ఉదయ్ కిరణ్.. ఆ ఒక్క కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా..?

Uday Kiran : దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా చిత్రం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్‌ తొలి సక్సెస్‌ అందుకున్నాడు. ఆ తర్వాత వెంట వెంటనే నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్‌స్టోరీల్లో నటించి హ్యాట్రిక్‌ కొట్టాడు. అంతేకాదు ఈ చిత్రాలతో లవర్‌ బాయ్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండానే స్టార్‌ హీరో హోదా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హిట్‌లు, ప్లాప్‌లు అందుకున్నా అతడి జీవితం చివరకు విషాదంగా ముగిసింది.

ఉదయ్ కిరణ్ నటన.. సొట్టబుగ్గల అందానికి అమ్మాయిల్లో తెగ ఫాలోయింగ్ ఉండేది. ఎంత త్వరగా ఉదయ్ కిరణ్ కెరీర్ తారా స్థాయికి చేరిందో అంతే వేగంతో కిందకు చేరింది. దానికి ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం ఒక కారణం అయితే.. మరో కారణం పర్సనల్ లైఫ్ లో జరిగిన అనేక విషయాలు. చిరంజీవి పెద్ద కూతురుతో ఉదయ్ కిరణ్ కు పెళ్లి నిశ్చయమయింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వివాహం క్యాన్సల్ అయిన విషయం తెలిసిందే. వచ్చిన ఆఫర్లను కూడా దర్శకులు నిర్మాతలు వెనక్కి తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.

this is the main reason for uday kiran suicide

ఇదిలావుండగా ఒక ఇంటర్వ్యూలో నటుడు దిల్ రమేష్ ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్ చనిపోయే సమయానికి తాను అతనితో క్లోజ్ గా ఉన్నానని తెలిపారు. పెద్ద హీరోలు అంటే చాలా రిసర్వ్ డ్ గా ఉంటారని మన కంటే తక్కువ వయస్సు ఉన్న హీరోలు అయితే ఫ్రెండ్లీ గా ఉంటారని తెలిపారు. ఉదయ్ కిరణ్ అప్పట్లోనే 75 లక్షల నుండి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న హీరో అని చెప్పారు. సక్సెస్ స్ట్రెస్ వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని రమేష్ వెల్లడించారు. దిల్ రమేష్ దిల్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Admin

Recent Posts