వినోదం

చంద్ర‌మోహ‌న్ అందుక‌నే త‌న పిల్ల‌ల్ని హీరోయిన్ల‌ను చేయ‌లేదా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హీరోగా&comma; క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా ఎంతో గుర్తింపుని తెచ్చుకున్న వారిలో చంద్రమోహన్ ఒకరు&period; ఈయన పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు&period; 1966వ సంవత్సరంలో రంగులరాట్నం సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టారు చంద్రమోహన్&period; అప్పటినుండి ఇప్పటివరకు హీరోగా&comma; క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 932 సినిమాలలో నటించారు&period; ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల సత్తా ఉన్న నటుడు చంద్రమోహన్&period; ఆయన తన సినీ ప్రస్థానంలో ఎందరో స్టార్ హీరోలతో కూడా కలిసి నటించారు&period; అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రమోహన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తారు&period; కానీ చంద్రమోహన్ మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెంచారు&period; తన కూతుర్లను సినీ రంగానికి తీసుకురాకపోవడానికి అసలు కారణాలు ఏంటో ఆయన ఆ ఇంటర్వ్యూలో వివరించారు&period; నాకు ఇద్దరు అమ్మాయిలు&period; ఇద్దరూ చూడడానికి చక్కగా అందంగా ఉంటారు&period; అందులో చిన్న కూతురు ఇంకా అందంగా ఉంటుంది&period; చిన్నప్పుడు వాళ్లను చూసిన నటి భానుమతి ఇద్దరూ చాలా అందంగా ఉన్నారని చెప్పింది&period; వారిని చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేద్దామని నన్ను అడిగింది&period; కానీ నేను సున్నితంగా తిరస్కరించాను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80128 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;chandramohan&period;jpg" alt&equals;"this is the reason why chandra mohan not allowed his kids into film industry " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాకు పిల్లలతో గడిపే సమయం కూడా ఉండేది కాదు&period; ఉదయం వారు లేవకముందే షూటింగ్ కి వెళ్లి పోయేవాడిని&period; నా భార్య పిల్లలను ఎప్పుడైనా షూటింగ్ కి తీసుకువచ్చేది&period; వాళ్లు నన్ను గుర్తుపట్టేవాళ్ళు కాదు&period; వాళ్లకి సినిమా షూటింగ్ చూపిస్తే మళ్లీ ఎప్పుడు తీసుకెళ్తావ్ అని అడుగుతారని భయం వేసేది&period; సినిమాల ప్రభావం వారిపై పడకుండా పెంచాలని అనుకున్నాం&period; ఇద్దరూ చదువుల్లో బాగా రాణించారు&period; గోల్డ్ మెడలిస్టులు అయ్యారు&period; మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు&period; ఇక ఇప్పుడు వారికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలన్న ఆలోచన మాత్రమే ఉంది అని చెప్పుకొచ్చారు చంద్రమోహన్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts