Mahesh Babu : కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఆయనకి ఇప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన కెరీర్ ను.. ఫ్యామిలీని సమానంగా బ్యాలెన్స్ చేస్తారు. సినిమాలు చేస్తూనే ఖాళీ దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో గడపడం కోసం విదేశాలకు పయనం అవుతాడు. ఇక బిజినెస్‌లతో కూడా ఫుల్ బిజీగా ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మహేష్ కెరీర్‌లో ఇప్పటివరకు హిట్స్ మాత్రమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌లుగా మిగిలిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి.. అయితే ఆ సినిమాలలో ఓ సినిమా మొదటిగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుని.. ఆ తర్వాత సూపర్ హిట్‌గా నిలిచింది. ‘రాజకుమారుడు’తో హీరోగా తెలుగుతెరపైకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. ఆ తర్వాత ‘యువరాజు’ సినిమా చేయగా, ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన మూడో సినిమా ‘వంశీ’ అట్టర్ ప్లాప్ అయింది. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలని కృష్ణవంశీ దర్శకత్వంలో మురారి అనే చిత్రం చేశాడు. ఈ సినిమా చూసి అందరు ఫ్లాప్ అనుకున్నారు.
మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ కథను అప్పట్లో వద్దన్నారట. కానీ ‘మురారి’ కథపై మహేష్ నమ్మకం ఉంచి సినిమా చేయగా, ఇది చూసిన కృష్ణ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది. దాంతో ఫస్ట్ షో కల్లా బుకింగ్స్ భారీగా పెరగడం, అలా మాస్ సెంటర్లలో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ సినిమా చూసి.. మహేష్ బాబు నటనను మెచ్చుకొని ప్రశంసించారు. అలా ‘మురారి’ మూవీ మొదట ఫ్లాప్ టాక్ తెచ్చుకుని.. ఆ తర్వాత సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం 2001 సంవత్సరంలో ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.