విజయం అనేది రాత్రికి రాత్రే ఆకాశం నుంచి ఊడిపడేది కాదనేది అందరికీ తెల్సిన విషయమే.. ఈరోజు మనం వెండితెర మీద చూస్తున్న చాల మంది ప్రముఖ హీరో, హీరోయిన్లు ఒకప్పుడు హీరో / హీరోయిన్ స్నేహితుల్లాగో, అక్క, చెల్లెల్లు, లేదా passing షాట్స్ ద్వారా వెండితెర అరంగేట్రం చేసినవారే.. ( స్టార్ కిడ్స్ ని మినహాయిస్తే).. ఈ జాబితా లో కొంతమంది నటీ/ నటులు ఎవరంటే.. తెలుగు నటుల్లో మాస్ మహారాజ్ రవితేజకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. 90 వ దశకంలో ఎంట్రీ ఇచ్చిన రవితేజ కి పూర్తి స్థాయి మాస్ హీరో గా బ్రేక్ రావడానికి దాదాపుగా ఒక దశాబ్దం పైగానే పట్టింది.. అయితే అయన నటించిన మొదటి సినిమా.. నాగార్జున – టబు నటించిన మొదటి చిత్రం నిన్నే పెళ్లాడుతా.. ఆ సినిమాలో హీరోయిన్ టబు ని పబ్ లో ఏడిపించే సీన్ లో అతి చిన్న పాత్రలో కనిపిస్తారు రవితేజ.. బాగా పట్టి పట్టి చుస్తే తప్ప ఆ నటుడు రవితేజ అంటే నమ్మడం కష్టమే.. అప్పట్లో కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ గా చేసేవారట రవి.. టబు మీద అభిమానంతో ఆ సీన్ చేసినట్టు చెప్పారు ఒక ఇంటర్వ్యూ లో..
యువ హీరో శర్వానంద్ కూడా శంకర్ దాదా mbbs లో ఒక చిన్న పాత్ర పోషించారు.. అయితే ఈ పాత్ర కథాపరంగా కొద్దోగొప్పో ప్రాధాన్యత కలదే.. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా 90 ల్లో ఒక దూరదర్శన్ సీరియల్ లో బాల నటుడు గా చేసారు.. అవి కాకుండా నువ్విలా, లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ లాంటి సినిమాల్లో చాలా చిన్న పాత్రల్లో నటించారు.. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా మొదట శేఖర్ కమ్ముల లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ సినిమా లో చిన్న పాత్రలో మెప్పించిన వారే.. హీరో/ విలన్ అనే తేడా లేకుండా ఎటువంటి పాత్రనైనా అవలీలగా చేసేస్తూ మెప్పిస్తున్నవిలక్షణ నటుడు విజయ్ సేతుపతి మొదటగా కనిపించింది ధనుష్ నటించిన పుదు పెట్టై (తెలుగులో ధూల్ పేట) సినిమా లో హీరో స్నేహితుని పాత్రలో..
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన అంటూ యువకుల గుండెలను వర్షంతో తడిపేసిన త్రిష కూడా నటి సిమ్రాన్ స్నేహితురాలిగా ఒక చిన్న పాత్రలో జోడి సినిమాలో కనిపిస్తారు.. నటుడు సూర్య తమ్ముడిగానే కాకుండా, తనకంటూ ఒక సొంత ఇమేజ్, విలక్షణ చిత్రాలతో అలరిస్తున్న నటుడు కార్తీ కూడా మణిరత్నం యువ సినిమాలో ఒక సహాయ నటుడి పాత్రలో కనిపిస్తారు.. మణిరత్నం అసిస్టెంట్ గా ఉన్నప్పుడు అనుకోకుండా ఈ పాత్ర వచ్చినదని చెప్తారు కార్తీ.. ఇలా ఒకరు, ఇద్దరూ కాదండీ ఈ లిస్టు పెద్దదే.. వెండితెర మీద అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమై, బుల్లితెర మీద విజయం సాధించి, ఆ క్రేజ్ తో హీరో అయిన వాళ్ళు కూడా ఉన్నారు.. అయితే ప్రతిభ తో పాటుగా అదృష్టం కూడా తోడైతేనే ఎక్కువకాలం సినీ పరిశ్రమలో నిలువగలుగుతారు..