వినోదం

Maharshi Old Movie : క‌ల్ట్ సినిమాగా రూపొందిన మ‌హ‌ర్షి మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది.. కార‌ణం ఇదేనా?

Maharshi Old Movie : ఈ నాటి ప్రేక్ష‌కుల‌కి మ‌హ‌ర్షి చిత్రం అంటే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన చిత్రం గుర్తుకు వస్తుంది.ఈ సినిమా మంచి కాన్సెప్ట్‌తో రూపొంది పెద్ద విజ‌య‌మే సాధించింది. అయితే మ‌హేష్ మహ‌ర్షి క‌న్నా ముందు వంశీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షి అనే చిత్రం రూపొందింది. దీనిని క‌ల్ట్ మూవీగా రూపొందించారు. ఈ మూవీలో పాటలు, హీరోగా నటించిన రాఘవ పర్ఫామెన్స్ అద్భుతం అని చెప్పాలి.. మహర్షి సినిమాకి సంగీతాన్ని ఇళయరాజా అందించారు.ఇందులోని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పాలి. ఇక ఇందులో క‌థానాయిక‌గా అప్పుడప్పుడే హీరోయిన్గా అడుగులు వేస్తున్న భానుప్రియ చెల్లెలు నిశాంతి నటించింది.

మ‌హ‌ర్షి సినిమా వ‌చ్చి పాతికేళ్లు అవుతుంది. అయిన‌ప్ప‌టికీ అంద‌రు కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఇందులో ఎంత కంటెంట్ ఉంద‌నేది అర్ధ‌మ‌వుతుంది. క‌మ‌ర్షియ‌ల్ హిట్ కాక‌పోయిన కూడా ఈ మూవీ మాత్రం ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో నిలిచిపోయింది. ఈ సినిమా ఎందుకు ఆడలేదో కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫీలింగ్ అందరికీ వస్తోంది. సినిమాలో నటించిన రాఘవ పెర్ఫార్మన్స్ చూసి ఇత‌ను ఎందుకుకు గొప్ప నటుడు కాలేకపోయాడు అని అడుగుతున్నారు. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే చాలా మంది చూస్తూ ఉంటారు. మూవీ చూసిన వారికి గుండె బ‌రువెక్కి పోవ‌డం ఖాయం.

why maharshi movie became flop

అప్పట్లో మహర్షి సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అలానే అందులో హీరోగా నటించిన రాఘవకి కూడా ఫాలోయింగ్ బానే ఉంది. అంతగా ప్రేమిస్తున్నా ఈ వ్యక్తిని హీరోయిన్ నిశాంతి ఎందుకు ప్రేమించలేదు అనే పాయింట్ చాలా మందికి అర్ధం కాలేదు. అయితే భాను ప్రియ చెల్లెలు ఇందులో క‌థానాయిగా న‌టించ‌డంతో ఆమె నుండి చాలా ఆశించారు. కాని ఆమె త‌న అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డంలో కాస్త విఫ‌ల‌మైందని చెప్పాలి. మహర్షిని నిరాకరించడంలోని పాయింట్ కూడా జనాలకి కనెక్ట్ కాక‌పోవ‌డం కూడా పెద్ద కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అంత మంచి సినిమా ఇప్ప‌టికీ టీవీల‌లో ఆద‌ర‌ణ పొందుతూనే ఉంది.

Admin

Recent Posts