వినోదం

Suhasini : ఎన్‌టీఆర్ తో క‌లిసి సుహాసిని ఎందుకు న‌టించ‌లేదు.. కార‌ణం ఏమిటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Suhasini &colon; నందమూరి తారక రామారావు అంటే ఒక గొప్ప నటుడు&period; ఈయనను తెలుగు ప్రజలు అన్నగారు అని ప్రేమగా పిలుచుకుంటారు&period; ఎన్టీఆర్ పలు భాషలలో సుమారుగా 400 చిత్రాలలో నటించారు&period; అలాగే పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వ్యవహరించారు&period; ఆయన చేసే పాత్ర ఏదైనా సరే పాత్రకు జీవం పోసే గొప్ప నటుడు ఎన్టీఆర్&period; తెలుగు ప్రజలకు రాముడు&comma; కృష్ణుడు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ ప్రతిరూపమే&period; ఇప్పటికికూడా తెలుగు తెరకు నంబర్ వన్ కథానాయకుడు ఎవరు అని అడగగానే మొదటగా ఎన్టీఆర్ పేరే చెబుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాలలో నటించడానికి ఎంతో మంది హీరోయిన్స్ క్యూ కట్టేవారు&period; ఆయన చిత్రాలలో నటించడానికి ఒక్క ఛాన్స్ వస్తే చాలని తహతహలాడిపోయేవారు&period; సావిత్రి&comma; జమున&comma; శ్రీదేవి&comma; జయసుధ&comma; జయప్రద&comma; వాణిశ్రీ&comma; రాధ వంటి ఎంతో మంది తారలు ఆయన పక్కన నటించి అగ్రస్థాయి హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు&period; దాదాపు అందరు హీరోయిన్స్ ఎన్టీఆర్ పక్కన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు&period; కానీ అప్పట్లో ఒకే ఒక్క హీరోయిన్ కు ఎన్టీఆర్ సరసన ఆడిపాడే అవకాశం దక్కలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58144 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;suhasini&period;jpg" alt&equals;"why suhasini did not act with sr ntr" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ మంచి ఫామ్‌లో ఉన్న‌ సమయంలోనే సుహాసిని కూడా సినీ రంగంలోకి అడుగు పెట్టారు&period; సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా పలు ఇంటర్వ్యూలలో అన్న గారితో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు&period; కానీ సుహాసినికి ఆ కోరిక అలాగే మిగిలిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1983 లో సుహాసిని స్వాతి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు&period; ఈ చిత్రంలో తల్లీ కూతురుగా సుహాసిని&comma; శారద నటించారు&period; ఈ చిత్రంలో స్వాతి &lpar;సుహాసిని&rpar; చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న తల్లి శారదకు మళ్లీ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుంది&period; శారద భర్త క్యారెక్టర్ లో కొంగర జగ్గయ్య నటించారు&period; శారద భర్త క్యారెక్టర్ లో ముందుగా ఎన్టీఆర్ ని నటింపజేయడానికి ఆయనను సుహాసిని సంప్రదించింది అని అప్పట్లో టాక్ వినిపించింది&period; స్వాతి చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్ కూడా జగ్గయ్య పాత్రలో ముందుగా ఎన్టీఆర్ ని తీసుకోవాలని అనుకున్నారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించి ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల స్వాతి చిత్రంలో నటించే అవకాశం కుదరలేదు&period; స్వాతి చిత్రంలో సుహాసిని నటనకు బెస్ట్ యాక్ట‌ర్‌ గా నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts