Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Suhasini : ఎన్‌టీఆర్ తో క‌లిసి సుహాసిని ఎందుకు న‌టించ‌లేదు.. కార‌ణం ఏమిటంటే..?

Admin by Admin
November 23, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Suhasini : నందమూరి తారక రామారావు అంటే ఒక గొప్ప నటుడు. ఈయనను తెలుగు ప్రజలు అన్నగారు అని ప్రేమగా పిలుచుకుంటారు. ఎన్టీఆర్ పలు భాషలలో సుమారుగా 400 చిత్రాలలో నటించారు. అలాగే పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వ్యవహరించారు. ఆయన చేసే పాత్ర ఏదైనా సరే పాత్రకు జీవం పోసే గొప్ప నటుడు ఎన్టీఆర్. తెలుగు ప్రజలకు రాముడు, కృష్ణుడు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ ప్రతిరూపమే. ఇప్పటికికూడా తెలుగు తెరకు నంబర్ వన్ కథానాయకుడు ఎవరు అని అడగగానే మొదటగా ఎన్టీఆర్ పేరే చెబుతారు.

అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాలలో నటించడానికి ఎంతో మంది హీరోయిన్స్ క్యూ కట్టేవారు. ఆయన చిత్రాలలో నటించడానికి ఒక్క ఛాన్స్ వస్తే చాలని తహతహలాడిపోయేవారు. సావిత్రి, జమున, శ్రీదేవి, జయసుధ, జయప్రద, వాణిశ్రీ, రాధ వంటి ఎంతో మంది తారలు ఆయన పక్కన నటించి అగ్రస్థాయి హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు అందరు హీరోయిన్స్ ఎన్టీఆర్ పక్కన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ అప్పట్లో ఒకే ఒక్క హీరోయిన్ కు ఎన్టీఆర్ సరసన ఆడిపాడే అవకాశం దక్కలేదు.

why suhasini did not act with sr ntr

ఎన్టీఆర్ మంచి ఫామ్‌లో ఉన్న‌ సమయంలోనే సుహాసిని కూడా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా పలు ఇంటర్వ్యూలలో అన్న గారితో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ సుహాసినికి ఆ కోరిక అలాగే మిగిలిపోయింది.

1983 లో సుహాసిని స్వాతి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో తల్లీ కూతురుగా సుహాసిని, శారద నటించారు. ఈ చిత్రంలో స్వాతి (సుహాసిని) చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న తల్లి శారదకు మళ్లీ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుంది. శారద భర్త క్యారెక్టర్ లో కొంగర జగ్గయ్య నటించారు. శారద భర్త క్యారెక్టర్ లో ముందుగా ఎన్టీఆర్ ని నటింపజేయడానికి ఆయనను సుహాసిని సంప్రదించింది అని అప్పట్లో టాక్ వినిపించింది. స్వాతి చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్ కూడా జగ్గయ్య పాత్రలో ముందుగా ఎన్టీఆర్ ని తీసుకోవాలని అనుకున్నారట.

అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించి ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల స్వాతి చిత్రంలో నటించే అవకాశం కుదరలేదు. స్వాతి చిత్రంలో సుహాసిని నటనకు బెస్ట్ యాక్ట‌ర్‌ గా నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది.

Tags: Suhasini
Previous Post

Lemon Piece For Diabetes : ప‌ర‌గ‌డుపున ఒక్క ముక్క తింటే చాలు.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి..!

Next Post

Sukumar Movies : డైరెక్టర్ సుకుమార్ సినిమాల్లో ఉండే ఈ కామన్ పాయింట్ ని ఎప్పుడైనా గమనించారా..!

Related Posts

వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025
lifestyle

బుద్ధుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే మీకు తిరుగు ఉండ‌దు..!

July 4, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కొబ్బ‌రికాయ‌ను కొట్టాలా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీ జాత‌కంలో కుజ దోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటించండి..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.