హెల్త్ టిప్స్

Lemon Piece For Diabetes : ప‌ర‌గ‌డుపున ఒక్క ముక్క తింటే చాలు.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి..!

Lemon Piece For Diabetes : ఈరోజుల్లో మారిన జీవన శైలి, సరైన వ్యాయామం లేకపోవడం, ఆహార అలవాట్లు ఇలా రకరకాల కారణాల వలన, చాలామంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది, డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం, అలానే గుండె సమస్యలతో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్నట్లయితే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో, కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా తొందరగా పెరిగిపోతాయి. అందుకని, ఎంత జాగ్రత్తగా అయితే, అంత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నట్లయితే, మందులు వాడుతూ ఇంటి చిట్కాలని కూడా పాటించడం మంచిది. ఇలా చేయడం వలన, డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు.

డయాబెటిస్ కారణంగా, వచ్చే సమస్యలు కూడా, ఇంటి చిట్కాలతో తగ్గుతాయి. ఇలా కనుక మీరు చేసినట్లయితే, కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది. ఈ రెమిడి కోసం, మీరు రెండు నిమ్మకాయలని రసం తీసుకొని, పక్కన పెట్టుకోండి. నిమ్మకాయ తొక్కలని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి. నిమ్మకాయ తొక్కలో పొటాషియం, కాల్షియంతో పాటుగా ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.

lemon piece for diabetes take on on empty stomach for many benefits

రక్తపోటుని కంట్రోల్ లో ఉంచుతుంది. నిమ్మతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. అలానే, సెలరీ రూట్ ని తీసుకుని, తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ కె తో పాటుగా, ఇతర పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ సమస్యని తగ్గించగలదు. బిర్యానీ ఆకుల్ని కూడా తీసుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని, రెండు గ్లాసుల నీళ్లు పోసుకోండి.

నిమ్మకాయ తొక్కలు ముక్కలు, సెలెరీ రూట్ ముక్కలు, బిర్యానీ ఆకులు వేసి ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత బిర్యానీ ఆకుల్ని తీసేసి, మిక్సీ జార్లో మిగిలిన వాటిని కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని, మీరు ఒక గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకోండి. ప్రతిరోజు పరగడుపున ఒక స్పూన్ తీసుకుంటే చాలు. డయాబెటిస్ కంట్రోల్ అయిపోతుంది.

Admin

Recent Posts