వ్యాయామం

Exercises For Eye Sight : ఈ 5 వ్యాయామాల‌ను రోజూ చేస్తే చాలు.. మీ కంటి చూపు అమాంతం పెరుగుతుంది..!

Exercises For Eye Sight : కంటి చూపును మెరుగు పరుచుకోవాలంటే.. సహజంగానే ఎవరైనా సరే.. విటమిన్ ఎ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే దాంతోపాటు త్రాటక అనే ఓ యోగా ప్రక్రియ కూడా మనకు అందుబాటులో ఉంది. నిజానికి ఇది ఒక వ్యాయామం. దీంతో మన కంటి చూపు మెరుగుపడుతుంది. అయితే దీన్ని ఎలా చేయాలో, దాంతో మనకు ఇంకా ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అరచేతి సైజులో ఉండే ఒక ఆకుని తీసుకుని అందులో నల్లని వృత్తాన్ని గీయాలి. అనంతరం ఆ ఆకును గోడకు అతికించాలి. దాని ఎదురుగా 2 అడుగుల దూరంలో కూర్చుని అదే ఆకును 5 నుంచి 10 నిమిషాల పాటు తీక్షణంగా చూడాలి. ఈ వ్యాయామాన్ని ఉదయం, సాయంత్రం చేయాలి. అయితే ఆకును చూసే సమయంలో కళ్లను ఆర్పకూడదు. తెరిచే ఉంచాలి.

చీకటి గదిలో ఒక క్యాండిల్‌ను వెలిగించి దానిపైపే కన్నార్పకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు చూడాలి. ఈ వ్యాయామాన్ని కూడా నిత్యం ఉదయం, సాయంత్రం చేయాలి. కళ్లు తెరిచి చూసినా ఏమీ కనిపించని చీకటి గదిలో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉండాలి. కళ్లు తెరిచే చీకటిని గమనించాలి. కన్నార్పకూడదు. ఈ వ్యాయామాన్ని నిత్యం ఒక్కసారి చేస్తే చాలు. పచ్చని ప్రకృతిలో కూర్చుని నీలంగా ఉన్న ఆకాశం వైపు కన్నార్పకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు చూడాలి. ఈ వ్యాయామాన్ని నిత్యం ఒక్కసారి చేయాలి.

Exercises For Eye Sight do these regularly for better eye health

మీకు నచ్చిన వ్యక్తులు లేదా మీకిష్టమైన దేవుడు/దేవత ఫొటోగానీ, ఏదైనా ఒక క్రిస్టల్, పెద్దదైన పువ్వు లేదా సూదిలోకి దారం ఎక్కించే మొనను గానీ తదేకంగా 5 నుంచి 10 నిమిషాల పాటు నిత్యం చూడాలి. ఆ వస్తువుకు, మీకు మధ్య 2 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. వాటిని చూసేటప్పుడు కన్నార్పకూడదు. ఈ వ్యాయామాన్ని కూడా నిత్యం ఒక్కసారి చేస్తే చాలు. ఇప్పుడు చెప్పిన విధంగా వ్యాయామాలు చేయడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. ఏకాగ్రత అలవడుతుంది. ఏదైనా పనిచేసేటప్పుడు కావల్సిన ఏకాగ్రత లభిస్తుంది. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. చిన్నారుల్లో జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి పెరుగుతాయి.

Admin

Recent Posts