Health Tips : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల శారీరక, మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరికీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. యోగా, ఇతర వ్యాయామాలను రోజూ చేస్తున్నారు. అయితే సాధారణంగా చాలా మంది ఉదయం రన్నింగ్ చేస్తుంటారు.
రోజూ రన్నింగ్ చేసేవారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్ తగ్గుతుంది. అయితే రోజూ రన్నింగ్ చేసేవారు శక్తి కోసం రోజూ కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిమ్మకాయల్లో విటమిన్ సి, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువల్ల రోజూ నిమ్మరసం తీసుకుంటే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. దీన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే తీసుకోవచ్చు. లేదా రోజులో ఇతర సమయాల్లోనూ హెర్బల్ టీ లలో కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
2. రన్నింగ్ చేసేవారు రోజూ కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో అరటి పండు ఒకటి. దీన్ని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. దీంతో రన్నింగ్ వల్ల అలసట వచ్చిన వారు వెంటనే శక్తిని పొందవచ్చు. అరటి పండ్లలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది షుగర్‌ను తగ్గిస్తుంది. అందువల్ల రోజూ రన్నింగ్ చేసిన వారు అరటి పండ్లను తినాల్సి ఉంటుంది.
3. వాల్ నట్స్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మన శరీరానికి ఉపయోగపడే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, విటమిన్ ఇ, ఇంకా ఇతర అనేక పోషకాలు వాల్ నట్స్‌లో ఉంటాయి. అందువల్ల రోజూ రన్నింగ్ చేసేవారు వాల్ నట్స్ ను తింటే శక్తితోపాటు పోషకాలను అందుకోవచ్చు. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. అధిక బరువు తగ్గాలనుకునేవారు రోజూ రన్నింగ్ చేశాక వాల్ నట్స్ ను తింటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. త్వరగా బరువు తగ్గుతారు.
4. చియా విత్తనాల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం రన్నింగ్ చేసిన అనంతరం తినవచ్చు. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. అలాగే ఫైబర్ లభిస్తుంది కనుక జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. శక్తి కూడా లభిస్తుంది.
5. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రన్నింగ్ చేసిన అనంతరం వచ్చే నొప్పులను, వాపులను తగ్గిస్తాయి. కనుక రోజూ రన్నింగ్ చేసేవారు ఎలాంటి నొప్పులు, వాపులు రాకుండా ఉండాలంటే.. రోజూ చెర్రీ పండ్లను ఒక కప్పు మోతాదులో తినాల్సి ఉంటుంది.