Featured

స‌క‌ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణం మైదా పిండి.. దీంతో త‌యారు చేసే రోటీలు, బేక‌రీ ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటే శ‌రీరానికి హాని క‌లుగుతుంది, జాగ్ర‌త్త‌..!

మైదా పిండి లేదా దాని నుండి తయారైన ఉత్పత్తులు మన ఆరోగ్యానికి చెడ్డవని మనం తరచుగా వింటుంటాం. కానీ నిజంగా ఎందుకు చెడ్డవి లేదా అవి మనకు ఎంతగా హానిని కలిగిస్తాయో మనలో చాలా మందికి తెలియదు. మైదాతో తయారు చేసిన చాలా ఆహార పదార్థాలు చాలా రుచికరంగానే ఉంటాయి. అయితే ఇవి వాస్తవానికి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

are you eating foods made with maida flour then you will get lot of health problems

ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలలో చాలా వ‌ర‌కు మైదా పిండి క‌లుస్తుంది. ఇక హోట‌ళ్ల‌లో త‌యారు చేసే రోటీలు, బేక‌రీ ప‌దార్థాలు, ఇత‌ర ఆహారాల్లోనూ మైదా పిండిని ఎక్కువ‌గా వాడుతారు. దీంతో ఆయా ఆహారాల‌కు రుచి అయితే వ‌స్తుంది. కానీ మ‌నం రుచి కోసం చూస్తే వాటి వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది.

మైదా పిండి తెల్ల‌గా ఉంటుంది. గోధుమ పిండిని బాగా ప్రాసెస్ చేసి దాన్ని త‌యారు చేస్తారు. ఈ క్ర‌మంలో పిండి తెల్ల‌గా మారుతుంది. కానీ అందులో ఉండే పోష‌కాలు అన్నీ న‌శిస్తాయి. పైగా మైదా పిండి గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) చాలా ఎక్కువ‌. మైదా పిండి జీఐ 71 వ‌ర‌కు ఉంటుంది. అంటే దాన్ని తిన్న వెంట‌నే మ‌న ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం పెరుగుతాయి. షుగ‌ర్ ఉన్న‌వారికి ఇది అస్స‌లు మంచిది కాదు. షుగ‌ర్ లేని వారు కూడా మైదా పిండిని తింటే శ‌రీరంలో ఒక్క‌సారిగా గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అందులో చాలా వ‌ర‌కు మ‌న‌కు అవ‌సరం ఉండ‌దు. దీంతో అదంతా కొవ్వు కింద మారుతుంది. క‌నుక మైదా పిండి ఎవ‌రికైనా స‌రే హానిని క‌ల‌గ‌జేస్తుంది.

ఇక ప్ర‌స్తుతం చాలా మంది తింటున్న బ్రేక్‌ఫాస్ట్‌కు చెందిన ప‌దార్థాల్లోనూ మైదా పిండి క‌లుస్తోంది. రూమాలి రోటీ, నాన్, కేకులు, రొట్టెలు, ఎక్కువగా కాల్చిన ఆహారాలు, బిస్కెట్లు, స్నాక్స్, పాస్తా, నూడుల్స్, సమోసాలు.. ఈ జాబితా అంతులేనిది. మైదా దాదాపుగా అన్ని ర‌కాల‌ జంక్ ఫుడ్‌ల‌లోనూ ఉంటుంది. ఇది హోటళ్ళు, రోడ్ సైడ్ తినుబండారాలు, బేకరీలలో విక్రయించే ప‌దార్థాల్లో ఉంటుంది. పోషకాహార నిపుణులు , వైద్యులు సాధారణంగా ఒక వ్యక్తికి రక్తపోటు సమస్య ఉంటే ఉప్పు తీసుకోవడం తగ్గించాలని, డయాబెటిస్ ఉన్న‌వారిని తీపి తీసుకోవడాన్ని నియంత్రించాల‌ని సలహా ఇస్తారు. కానీ మైదా అనే దాన‌ని అస‌లు ఎవ‌రూ తిన‌కూడ‌దు.

మైడా పిండితో నూడుల్స్, పాస్తా, వైట్ బ్రెడ్ వంటి ఆహారాలను త‌యారు చేస్తారు. ఇవి అధిక గ్లైసీమిక్ విలువ‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం పెరుగుతాయి. మైదా అధిక గ్లైసీమిక్ విలువ‌ను క‌లిగి ఉంటుంది, క‌నుక ఇది చక్కెరలను రక్తప్రవాహంలోకి త్వరగా విడుదల చేస్తుంది. దీంతో ఇన్సులిన్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా పెరుగుతాయి. ఇలా కొంతకాలం ప్రాసెస్ చేయబడిన, శుద్ధి చేసిన ఆహారాల‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీంతో టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తుంది.

వేయించ‌బ‌డిన‌ మైదా ఆహారాలు మ‌న ఆరోగ్యాన్ని మరింత క్షీణింప‌జేస్తాయి. మైదా కలిగి ఉన్న ఆహారాల‌ను వేయించినప్పుడు.. అంటే ఉదాహ‌ర‌ణ‌కు.. సమోసాలు, వేయించిన నూడుల్స్, కచోరి, పురాన్ పోలి, జున్ను, పాస్తా, లాసాగ్నేస్ వంటివి శ‌రీరంలో కొవ్వు నిల్వ‌ల‌ను ఎక్కువ‌గా పెంచుతాయి. దీంతో జీవక్రియల‌కు విఘాతం కలుగుతుంది. ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తుంది. దీంతోపాటు గుండె జబ్బులు, ఆర్థరైటిస్, అల్జీమర్స్‌, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వ‌స్తాయి.

మైదాను తినడం వల్ల మీ శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) పెరుగుతుంది. ఇది మిమ్మల్ని స్థూల‌కాయులుగా చేస్తుంది. ధమనుల్లో ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌లిగిస్తుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. అయితే అది అక్క‌డితో ఆగ‌దు. మైదాను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల ఇంకా ఆహారాల‌ను, ముఖ్యంగా స్వీట్ల‌ను తినాల‌నే యావ పెరుగుతుంది. అది మ‌న ఆరోగ్యాన్ని మ‌రింత న‌శింప‌జేస్తుంది.

అందువ‌ల్ల మైదాతో ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని తెలుసుకోవాలి. ఆ ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. అంత‌గా ఆ ప‌దార్థాల‌ను తినాల్సి వ‌స్తే మైదా లేకుండా స్వ‌చ్ఛ‌మైన గోధుమ పిండితో ఇంట్లోనే ఆయా ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తినాలి. అలాగే తాజా పండ్లు, కూర‌గాయ‌ల‌ను రోజూ తీసుకోవాలి. తృణ ధాన్యాల‌ను తీసుకోవాలి. రోజూ క‌నీసం 30-40 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. దీని వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మైదా ద్వారా కలిగే దుష్ప్ర‌భావాల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts