Stop Smoking : ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది పొగ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారి ఆ విధంగా చాలా మందిని పొట్టన పెట్టుకుంటోంది. ఈ క్రమంలోనే చాలా మంది పొగ తాగడానికి బానిసలు అవుతున్నారు. ఆ వ్యసనాన్ని మానలేకపోతున్నారు. అది చాలా మంది జీవితాలను కబలించేస్తోంది. అయినప్పటికీ కొందరు పొగ తాగడం ఆపడం లేదు. ఇక కొందరు అయితే చెయిన్ స్మోకర్లుగా మారిపోతున్నారు. రోజులో సమయం దొరికినప్పుడల్లా యథేచ్ఛగా పొగ తాగుతున్నారు. దీంతో అనారోగ్యాల బారిన పడి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
పొగ తాగడం అనేది ఒక వ్యసనంగా చాలా మందికి మారింది. అయితే ఎంతటి చెయిన్ స్మోకర్లు అయినా సరే కింద తెలిపిన ఆహారాలను రోజూ 2 వారాల పాటు తీసుకోవాలి. దీని వల్ల పొగ తాగడం మానేస్తారు. 2 వారాల్లో మానేయలేకపోతే కనీసం 40 రోజుల పాటు ఈ ఆహారాలను తీసుకోవాలి. దీంతో తప్పకుండా పొగ తాగడం మానేస్తారు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. పొగ తాగేవారు కచ్చితంగా తమ ఆహారంలో నిమ్మకాయలను భాగం చేసుకోవాలి. వీటిని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం పరగడుపునే 1 టీస్పూన్ నిమ్మరసాన్ని నేరుగా తాగవచ్చు. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగవచ్చు. దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. పొగ తాగడాన్ని సులభంగా మానేస్తారు.
2. రోజువారి ఆహారంలో అల్లంను చేర్చుకున్నా పొగ తాగడం మానేయవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ అల్లం రసం సేవించాలి. అలాగే రోజులో ఎప్పుడైనా సరే నీటిలో చిన్న అల్లం ముక్క లేదా అల్లం తురుము వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా రోజూ తాగుతుంటే పొగ తాగడాన్ని మానేస్తారు.
3. పొగ తాగడం వల్ల రక్త నాళాలు కుచించుకుపోయి సన్నగా అవుతాయి. దీంతోపాటు వాటిల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ లు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే రక్త నాళాల్లో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా కిస్మిస్, బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్‌ను తింటే మేలు జరుగుతుంది. ఇవి స్మోకింగ్‌ను మానేసేందుకు కూడా సహాయం చేస్తాయి.
4. రోజూ ఒక క్యారెట్‌ను తినడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. దీంతోపాటు స్మోకింగ్ అలవాటును మానేస్తారు. క్యారెట్‌లలో ఉండే విటమిన్లు ఎ, సి, కెలతోపాటు బీటాక్రిప్టోజాంతిన్ అనే సమ్మేళనం స్మోకింగ్‌ను మానేసేలా చేస్తాయి. దీంతోపాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూస్తాయి.
5. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి, నిమ్మ, నారింజ, పైనాపిల్, జామ వంటి పండ్లను రోజూ తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. స్మోకింగ్‌ను మానేస్తారు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
6. క్రాన్ బెర్రీలను రోజూ తినడం వల్ల కూడా స్మోకింగ్‌ను మానేస్తారు. ఈ పండ్లలో ఉండే నాన్ డయాలైజబుల్ మెటీరియల్ స్మోకింగ్‌ను మానేసేలా చేస్తుంది. దీంతోపాటు ఊపిరితిత్తులను వైరస్‌ల బారి నుంచి రక్షిస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
7. రోజూ తగినంత మోతాదులో నీటిని తాగడం వల్ల కూడా పొగ తాగడాన్ని మానేస్తారు. నీటిని తగిన మోతాదులో తాగితే శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. దీంతో పొగ తాగడంపై ఉండే యావ తగ్గుతుంది.
పొగ తాగడం వల్ల కేవలం ఊపిరితిత్తులు చెడిపోవడమే కాదు, ఇతర అనేక అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. ముఖ్యంగా ఎముకలు బలహీనంగా మారుతాయి. రక్త నాళాలు సన్నగా మారి హార్ట్ ఎటాక్‌లు వస్తాయి. శృంగార సామర్థ్యం నశిస్తుంది. వీర్యం సరిగ్గా ఉత్పత్తి కాదు. శుక్రకణాల్లో నాణ్యత లోపిస్తుంది. ఇది సంతానం కలిగే అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది. అలాగే జింక్, కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలు శరీరానికి సరిగ్గా లభించవు. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది. కనుక పైన తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే దాంతో స్మోకింగ్‌ను మానేయవచ్చు. దీని వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.