Categories: Featured

కాకరకాయల్లో ఉండే చేదును తగ్గించేందుకు 5 చిట్కాలు..!

కాకరకాయ రుచిలో బాగా చేదుగా ఉంటుంది. అయితే ఇది అందించే ప్రయోజనాలు ఎన్నో. కాకరకాయల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాల గనిగా చెప్పవచ్చు. అయితే చేదు కారణంగా కాకరకాయలను తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. కానీ కింద తెలిపిన విధానాలు పాటిస్తే కాకరకాయల్లో చేదును సులభంగా తగ్గించవచ్చు. అందుకు ఏం చేయాలంటే…

here are the tips to remove bitterness from bitter gourd

1. పీలర్‌ సహాయంతో కాకరకాయ మీద ఉన్న పొట్టును తీసేయాలి. వాటి పైభాగం మృదువుగా అయ్యేలా మార్చాలి. దీంతో చాలా వరకు వాటిల్లో చేదు తగ్గుతుంది.

2. కాకరకాయల్లో ఉండే విత్తనాలను తొలగించడం వల్ల కూడా చేదు బాగా తగ్గుతుంది.

3. కాకరకాయ ముక్కలపై కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం 20 నుంచి 30 నిమిషాల పాటు ఆ ముక్కలను అలాగే ఉంచాలి. అనంతరం నీటితో బాగా కడగాలి. దీంతో చేదు చాలా వరకు తగ్గుతుంది.

4. ఉప్పును కాకరకాయ ముక్కలకు బాగా అప్లై చేశాక ఆ ముక్కల నుంచి రసం పిండాలి. దీని వల్ల కూడా చేదును తగ్గించవచ్చు.

5. పెరుగులో ఒక గంట పాటు కాకరకాయ ముక్కలను నానబెట్టడం వల్ల కూడా వాటిలో ఉండే చేదు తగ్గుతుంది.

Share
Admin

Recent Posts