Categories: Featured

ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఎంత ప‌రిమాణంలో పండ్ల‌ను తినాలి ?

తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు వాటి ద్వారా మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే పండ్ల విష‌యానికి వ‌స్తే నిత్యం ఎంత మోతాదులో వాటిని తీసుకోవాలో చాలా మందికి అర్థం కాక స‌త‌మ‌తం అవుతుంటారు. మ‌రి పండ్ల‌ను నిత్యం ఎంత ప‌రిమాణంలో తినాలి ? అంటే..

how much quantity of fruits we have to eat everyday

వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌) సూచిస్తున్న ప్ర‌కారం నిత్యం ఒక వ్య‌క్తి సుమారుగా 400 గ్రాముల వ‌ర‌కు పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కేవ‌లం పండ్లు మాత్ర‌మే అయితే సుమారుగా 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వ‌రకు వాటిని తీసుకోవ‌చ్చ‌న్న‌మాట‌. మిగిలిన మోతాదులో కూర‌గాయ‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

కూర‌గాయ‌ల‌ను కొన్నింటిని ప‌చ్చిగా కూడా తిన‌వ‌చ్చు. క‌నుక వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ తెలిపిన ప్ర‌కారం నిత్యం మ‌నం అధిక శాతం వ‌ర‌కు పండ్లు, కూర‌గాయ‌ల‌ను తిన‌డం మంచిది. దీని వ‌ల్ల శ‌రీరం వాటిల్లో ఉండే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. పోష‌ణ ల‌భిస్తుంది. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు.

Admin

Recent Posts