Categories: Featured

ఆయుర్వేదం ప్ర‌కారం రోగ నిరోధ‌క శ‌క్తిని ఇలా పెంచుకోండి..!!

దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. అనేక రాష్ట్రాల్లో రోజూ వేల సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోదవుతున్నాయి. ఈ క్ర‌మంలో కోవిడ్ రాకుండా ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప‌లు సూచ‌న‌లు పాటించాలి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలి. ఆయుర్వేద ప్ర‌కారం రోగ నిరోధ‌క శ‌క్తిని ఎలా పెంచుకోవ‌చ్చో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వివ‌రిస్తోంది. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే…

increase immunity with these ayurvedic tips

1. రోజూ గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ఉప్పు, ప‌సుపు క‌లిపి గొంతులో పోసుకుని పుక్కిలించాలి. ఇలా రోజూ చేయాలి.

2. ఇంట్లో వండిన తాజా ఆహార ప‌దార్థాల‌నే తినాలి. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాల‌ను తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో ప‌సుపు, జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు, అల్లం, వెల్లుల్లిని ఎక్కువ‌గా తీసుకోవాలి. ఉసిరికాయ‌ను కూడా వాడాలి. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

3. రోజూ 30 నిమిషాల చొప్పున యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. క‌నీసం 7-8 గంట‌ల పాటు అయినా నిద్రపోవాలి.

4. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 20 గ్రాముల చ్య‌వ‌న్‌ప్రాశ్ లేహ్యాన్ని సేవించాలి. రాత్రి భోజ‌నానికి ముందు కూడా దీన్ని తీసుకోవాలి. చ్య‌వ‌న్‌ప్రాశ్ లేహ్యాన్ని గోరు వెచ్చ‌ని నీటితో తీసుకోవాలి.

5. రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగాలి.

6. రోజూ రెండు సార్లు గుడుచి ఘ‌న్‌వ‌టి (500 మిల్లీగ్రాములు), అశ్వ‌గంధ ట్యాబ్లెట్లు (500 మిల్లీగ్రాములు) తీసుకోవాలి. భోజ‌నం త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో వీటిని తీసుకోవాలి.

7. తుల‌సి ఆకులు, దాల్చిన చెక్క‌, అల్లం, మిరియాలు వేసి త‌యారు చేసిన హెర్బ‌ల్ టీని రోజూ తాగాలి. అవ‌స‌రం అయితే అందులో బెల్లం, కిస్మిస్‌, యాల‌కులు వేసుకోవ‌చ్చు.

8. రోజూ ఉద‌యం, సాయంత్రం నువ్వుల నూనె లేదా కొబ్బ‌రినూనె లేదా నెయ్యిని రెండు చుక్క‌ల మోతాదులో రెండు ముక్కు రంధ్రాల్లోనూ వేసుకోవాలి.

9. రోజూ రెండు సార్లు ఆయిల్ పుల్లింగ్ చేయాలి. 1 టీస్పూన్ కొబ్బరినూనె లేదా నువ్వుల నూనె నోట్లో తీసుకుని నోట్లో తిప్పుతూ 2-3 నిమిషాల పాటు బాగా పుక్కిలించాలి. త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.

10. బాగా మ‌రిగిన నీటిలో పుదీనా లేదా కర్పూరం వేసి ఆవిరి ప‌ట్టాలి. రోజుకు ఇలా ఒక్క‌సారి చేయాలి.

11. ల‌వంగాలు లేదా అతిమ‌ధురం చూర్ణంలో చ‌క్కెర లేదా తేనె క‌లిపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. దీంతో ద‌గ్గు, గొంతు నొప్పి త‌గ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts