Betel Nut Leaves : తమలపాకులను పాన్ రూపంలో చాలా మంది తింటుంటారు. కేవలం పాన్ కోసమే వాటిని వాడుతారని అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే తమలపాకులను ఎంతో పూర్వ కాలం నుంచే ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. తమలపాకులతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తమలపాకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. కనుక ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. రోజూ రాత్రి పూట భోజనం అనంతరం రెండు తమలపాకులను నేరుగా అలాగే నమిలి మింగాలి. దీంతో మరుసటి రోజు ఉదయం వరకు షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా రెండు తమలపాకులను నమలాలి. దీని వల్ల రోజు మొత్తం షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి.
2. తమలపాకులను రోజూ తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి.
3. తమలపాకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. అందువల్ల తమలపాకులను రోజూ తింటే పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
4. తమలపాకుల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరం, విరేచనాలు వంటివి తగ్గిపోతాయి. అందుకు గాను తమలపాకులను పూటకు ఒకటి చొప్పున నమిలి తింటుండాలి.
5. తమలపాకు ఒకటి తీసుకుని దంచి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని వేసి గాయాలు, పుండ్లపై రాసి కట్టు కట్టాలి. దీంతో అవి త్వరగా మానుతాయి.
6. తమలపాకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అవి మన నాడీ మండల వ్యవస్థపై పనిచేస్తాయి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. సంతోషంగా ఉండేలా హార్మోన్లను ప్రేరేపిస్తాయి. అలాగే శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి.
7. తమలపాకులను తినడం వల్ల మలేరియా జ్వరం సైతం తగ్గిపోతుంది. నోట్లో ఉండే సూక్ష్మ జీవులు చనిపోయి నోటి దుర్వాసన తగ్గుతుంది. నోటి సమస్యల నుంచి బయట పడవచ్చు. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
8. తమలపాకులను తింటే ఎలాంటి జీర్ణ సమస్య అయినా తగ్గుతుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.