food

Amla And Ginger Tea : ఈ రెండింటితో టీ చేసుకుని తాగండి.. బోలెడు ప్ర‌యోజ‌నాలు..!

Amla And Ginger Tea : ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల సూత్రాలని పాటిస్తూ ఉంటారు. చాలా మంది ఇంటి చిట్కాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని అనుకుంటారు. అయితే ఉసిరి, అల్లం ఆయుర్వేదంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఉసిరి, అల్లం రెండూ కూడా అనేక లాభాలను కలిగిస్తాయి. ఈ రెండిటితో టీ చేసుకుని మనం తాగడం వలన బరువు తగ్గడం మొదలు అనేక ప్రయోజనాలని పొంద‌వ‌చ్చు.

ఉసిరి, అల్లం రెండిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ రెండిటినీ కలిపి మనం టీ తయారు చేసుకుని తాగడం వలన ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరం దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. ఉసిరి, అల్లం టీ తీసుకుంటే బరువు తగ్గడానికి కూడా అవుతుంది. ఈ టీ ని తీసుకోవడం వలన కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా ఈ టీ బాగా పని చేస్తుంది.

amla and ginger tea many wonderful health benefits

ఉసిరి, అల్లం టీ లివర్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలో మంటతో పోరాడడంలో సహాయం చేస్తుంది. ఇలా లివర్ ఆరోగ్యాన్ని కూడా ఈ టీ తో పెంపొందించుకోవచ్చు. ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా ఈ టీ అందిస్తుంది. ఇలా ఈ ప్రయోజనాలని సులభంగా ఈ టీ తో పెంపొందించవచ్చు.

ఇక టీ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ముందు నాలుగు కప్పులు నీళ్లు తీసుకోండి. అందులో ఒక చెంచా ఉసిరి పొడి, ఒక చెంచా అల్లం పొడి వేసుకోండి. ఒక కప్పు మిగిలే వరకు బాగా మరిగించుకోండి. తర్వాత స్టవ్ ఆపేసి, ఆ నీటిని ఒక కప్పులో పోసుకోవాలి. ఇందులో కొంచెం నల్ల ఉప్పు, తేనె కలుపుకుని తీసుకోవాలి. వేడిగా అయినా చల్లారిన తర్వాత అయినా ఈ టీ ని తీసుకోవచ్చు. ఇలా చక్కటి లాభాలని ఈ టీ తో పొంద‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts