food

కీర‌దోస స్మూతీ.. రుచికి రుచి.. పోష‌కాల‌కు పోష‌కాలు..!

శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు శీత‌ల పానీయాల‌ను ఎక్కువ‌గా తాగుతుంటారు. అయితే శీత‌ల పానీయాల్లో కూల్‌డ్రింక్‌లు కాకుండా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన పానీయాలు అయితే చాలా మంచిది. ఎందుకంటే.. కూల్‌డ్రింక్స్ అయితే మ‌న‌కు ఎలాంటి పోష‌కాల‌ను అందివ్వ‌వు. అలాగే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌వు. కానీ స‌హజ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేయ‌బ‌డిన పానీయాలు అయితే మ‌న‌కు అటు పోష‌ణ‌, ఇటు చ‌ల్ల‌ద‌నం రెండూ ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే మ‌న శ‌రీరానికి ఇలా రెండు విధాలుగా మేలు చేసే పానీయాల్లో కీర‌దోస స్మూతీ కూడా ఒక‌టి. దీన్ని తాగితే మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. అలాగే ప‌లు పోష‌కాలు కూడా అందుతాయి. మ‌రి కీర‌దోస స్మూతీ ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

కీరదోస స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

చ‌ల్ల‌ని పెరుగు – 270 గ్రాములు, కీర‌దోస పేస్ట్ – 200 గ్రాములు, క‌ట్ చేసిన ట‌మాటాలు – 10 గ్రాములు, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – త‌గినంత.

cucumber smoothie how to make it

కీర‌దోస స్మూతీ త‌యారు చేసే విధానం:

పైన చెప్పిన అన్ని ప‌దార్థాల‌ను బాగా క‌లిపి మిక్సీ ప‌ట్టాలి. జ్యూస్‌లా త‌యారు చేసుకోవాలి. అవ‌స‌రం అనుకుంటే కొంత నీరు క‌ల‌ప‌వ‌చ్చు. దీంతో కీర‌దోస స్మూతీ త‌యార‌వుతుంది. ఉప్పు, మిరియాల పొడిల‌ను టేస్ట్‌కు స‌రిప‌డా క‌లుపుకుంటే చాలు.. చ‌ల్ల చ‌ల్ల‌ని కీర‌దోస స్మూతీ రెడీ అయిన‌ట్టే..!

Admin

Recent Posts