Idli Poolu : కొబ్బరి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ, అల్పాహారం సమయంలో ఇడ్లీలని చేసుకుంటూ ఉంటారు. వారంలో రెండు సార్లు అయినా ఇడ్లీలను తీసుకుంటూ ఉంటారు. రోజు ఇడ్లీ తిన్నా, ఆరోగ్యానికి మంచిదే. ఈ తరం పిల్లలు కి కూడా రోజు ఇడ్లీలని అలవాటు చేయండి. ఇడ్లీ రోజు తీసుకోవడం వలన, ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో నూనె, మైదా వంటి హానికరమైన పదార్థాలు ఉండవు. కాబట్టి, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. తాజాగా ముంబైలో, ఒక ఫుడ్ వెండర్ నారియల్ పానీ ఇడ్లీ అని, కొత్త రకం ఇడ్లీ ని సృష్టించారు.
ఇది ఎలా అనే విషయాన్ని చూసేస్తే… ఇడ్లీ పిండిలో కొబ్బరినీళ్లు, కొంచెం కొబ్బరి కలిపారు. పువ్వు ఆకారంలో ఉన్న ప్లేట్లో పిండి వేసి, ఆవిరి మీద ఉడికించారు. ఇడ్లీల మీద లేత కొబ్బరి ముక్క, దానిమ్మ గింజలు వేసి గార్నిష్ చేశారు. అరటి ఆకులో సాంబారు, మూడు రకాల పచ్చళ్ళు వేసి ఇడ్లీలని సర్వ్ చేశారు. ఇడ్లీలు తిన్న వాళ్ళందరూ కూడా, ఇడ్లీలు అదిరిపోయాయని, రుచి చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు.
దీని ఖరీదు కూడా ఎక్కువ ఏం కాదు. కేవలం 69 రూపాయలు మాత్రమే. నిజానికి, ఇడ్లీల టేస్ట్ క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉంది అని ఆహార ప్రియులు అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసి చాలా మంది అవాక్ అయ్యారు కూడా.
ఈ వినూత్న క్రియేటివిటీ చూసి, నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొబ్బరినీళ్ళతో ఇడ్లీ పూలు ఐడియా అదుర్స్ కదా..? ఈసారి ఇలాంటివి ట్రై చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పైగా కాస్త కొత్తగా ఉంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. నచ్చితే నార్మల్ ఇడ్లీలే కాకుండా, ఈ ఇడ్లీలుని కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చు.