inspiration

Krishnan Mahadevan Iyer Idly : ల‌క్ష‌ల రూపాయ‌ల జాబ్ వ‌దులుకుని.. చిన్న ఇడ్లీ హోట‌ల్ నిర్వ‌హిస్తున్నాడు.. ఈయ‌న గురించి తెలిస్తే షాక‌వుతారు..!

Krishnan Mahadevan Iyer Idly : ప్ర‌స్తుత త‌రుణంలో ఉద్యోగం సంపాదించ‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. క‌రోనా వ‌చ్చి వెళ్లిన‌ప్ప‌టి నుంచి చాలా మంది ఉద్యోగాల‌ను కోల్పోయారు. ఎన్నో సంస్థ‌లు, కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. కొత్త‌వాళ్ల‌కు ఉద్యోగాలు రావ‌డం క‌ష్టంగా మారింది. ఎంతో నైపుణ్యం ఉంటే గానీ జాబ్స్ రావ‌డం లేదు. అలాంటిది ల‌క్ష‌ల రూపాయ‌ల జీతం వ‌చ్చే జాబ్‌ను ఎవ‌రైనా వ‌దులుకుంటారా.. లేదు క‌దా.. కానీ అత‌ను మాత్రం అలాంటి ప‌నే చేశాడు. ఇంత‌కీ అస‌లు అత‌ను ఎవ‌రు.. ఏం చేశాడు.. అన్న వివ‌రాల‌ను తెలుసుకుందాం రండి.

అత‌ని పేరు కృష్ణ‌న్ మ‌హాదేవ‌న్‌. ఉంటున్న‌ది బెంగ‌ళూరులో. గోల్డ్‌మ‌న్ సాక్స్ అనే ప్ర‌ముఖ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ల‌క్ష‌ల రూపాయ‌ల జీతం వ‌చ్చే జాబ్ అది. అయితే దాన్ని అత‌ను వ‌దులుకున్నాడు. కార‌ణం.. ఎన్నో ఏళ్ల నుంచి త‌న తండ్రి నిర్వ‌హిస్తున్న ఇడ్లీ హోట‌ల్‌ను చూసుకోవాల్సి రావ‌డ‌మే. కృష్ణ‌న్ మ‌హాదేవ‌న్ తండ్రి 2001లో బెంగ‌ళూరులోని విజ్ఞాన్ న‌గ‌ర్‌లో అయ్య‌ర్ ఇడ్లీ పేరిట ఓ చిన్న‌పాటి ఇడ్లీ హోట‌ల్‌ను ప్రారంభించాడు. అందులో కేవ‌లం ఇడ్లీల‌ను మాత్ర‌మే ఆయ‌న అమ్మేవారు. చ‌క్కని క్వాలిటీని పాటించ‌డం, మంచి రుచిగా ఉండ‌డంతో అన‌తికాలంలోనే అయ్య‌ర్ ఇడ్లీల‌కు ప్రాముఖ్య‌త ల‌భించింది.

do you know about iyer idli in bengaluru

ఆ ఇడ్లీల‌కు వారు కొబ్బ‌రి చ‌ట్నీ క‌లిపి అందించేవారు. వాటి టేస్ట్ అక్క‌డి ప్రాంత‌వాసుల‌కు ఎంత‌గానో న‌చ్చింది. దీంతో వారి హోట‌ల్‌కు రాను రాను గిరాకీ బాగా పెరిగింది. ఇక కృష్ణ‌న్ మ‌హాదేవ‌న్ కూడా ఓ వైపు కాలేజ్‌కు వెళ్తున్నా స‌రే వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా వ‌చ్చి హోట‌ల్‌లో ప‌నిచేసేవాడు. త‌రువాత అత‌ను ఉద్యోగంలో చేరిపోయాడు.

అయితే 2009లో త‌న తండ్రి చ‌నిపోయిన త‌రువాత కొంత‌కాలం పాటు అయ్య‌ర్ ఇడ్లీ హోట‌ల్‌ను నిర్వ‌హించారు. కానీ కృష్ణ‌న్ తల్లి ఉమ ఒక్క‌దాని వ‌ల్ల కాలేక‌పోయింది. దీంతో ల‌క్ష‌ల రూపాయ‌ల జాబ్‌ను కూడా కాద‌నుకుని వార‌స‌త్వంగా వ‌చ్చిన హోట‌ల్‌ను న‌డిపేందుకే కృష్ణ‌న్ నిర్ణ‌యించుకున్నాడు. ఆ త‌రువాత అత‌ను వెను దిరిగి చూడ‌లేదు. అదే క్వాలిటీ, రుచిని మెయింటెయిన్ చేస్తూ ఇడ్లీల‌ను విక్ర‌యించ‌సాగాడు. దీంతో ఇప్పుడు ఆ హోట‌ల్ మ‌రింత పేరుగాంచింది.

ఆ ప్రాంతంలో ఎన్నో హోట‌ల్స్ వ‌చ్చాయి. కానీ ఏవీ కూడా అయ్య‌ర్ ఇడ్లీల‌కు పోటీ ఇవ్వ‌లేక‌పోయాయి. అయ్య‌ర్ ఇడ్లీల‌కు ప్ర‌త్యేకంగా క‌స్ట‌మ‌ర్లు ఉండేవారు. వారు అందించే రుచి, క్వాలిటీ అద్బుతంగా ఉంటాయి. అందుక‌నే ఎన్ని హోట‌ల్స్ ఉన్న‌ప్ప‌టికీ అయ్య‌ర్ ఇడ్లీల‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఏర్ప‌డింది. ఇంతా చేస్తే ఆ హోట‌ల్ వైశాల్యం కేవ‌లం 200 చ‌ద‌ర‌పు అడుగులు మాత్ర‌మే. అంత చిన్న హోట‌ల్ ఉన్నా స‌రే వారు నెల‌కు 50వేల వ‌ర‌కు ఇడ్లీల‌ను విక్ర‌యిస్తున్నారు. ఇక ఇప్పుడు కేవ‌లం ఇడ్లీలే కాకుండా వ‌డ‌, కేస‌రి బాత్‌, ఖారా బాత్ వంటి ఇత‌ర టిఫిన్ల‌ను సైతం వ‌డ్డించ‌డం మొద‌లు పెట్టాడు. అలా అయ్య‌ర్ ఇడ్లీ ఎంతో పేరుగాంచింది. ఏది ఏమైనా ఇలా క్వాలిటీతో రుచిగా ఫుడ్‌ను అందించ‌డం అంటే మాట‌లు కాదు, అక్క‌డే హోట‌ల్ వారు స‌క్సెస్ అయ్యేది మ‌రి..!

Admin

Recent Posts