food

చల్ల చల్లని వాతావరణంలో.. వేడి వేడి ఉల్లిపాయ పకోడీలను తినేద్దాం..!

ప్రస్తుతం చ‌లికాలం మొదలవడంతో వాతావరణం ఎంతో చల్లగా ఉంది. మరి ఈ చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీలు తింటే ఆ మజాయే వేరుగా ఉంటుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఉల్లిపాయ పకోడి ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

ఉల్లిపాయ ముక్కలు రెండు కప్పులు, శెనగపిండి ఒక కప్పు, పచ్చిమిర్చి 5, ఉప్పు తగినంత, బేకింగ్ సోడా చిటికెడు, నీళ్లు తగినన్ని, గుప్పెడు కొత్తిమిర, కరివేపాకు రెమ్మలు 2, పుదీనా ఆకులు కొన్ని, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత.

make onion pakoda in this cool weather and eat

తయారీ విధానం

ముందుగా ఉల్లిపాయలను పొడవాటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని గిన్నెలోకి శెనగపిండి, కొత్తిమీర తురుము, పుదీనా ఆకులు, కరివేపాకులు చిన్నగా కత్తిరించి వేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేస్తూ కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉన్నప్పుడే పకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఫై నూనె పెట్టుకుని నూనె వేడి అయిన తర్వాత చిన్న చిన్నగా నూనెలు వేసుకుంటూ బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న పకోడీలను వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

Admin

Recent Posts