food

ప‌చ్చి బ‌ఠానీల‌తో చేసే ఈ వంట‌కాన్ని తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి మేలు చేస్తుంది

పచ్చి బఠానీతో వివిధ రకాల వంటలు చేసుకుంటారు..ప్రొటీన్ కు ఇది మంచి మూలం. మటర్ స్పైసీ దాల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..! థైరాయిడ్ వారికి ఇది బెస్ట్ ఫుడ్ ఐటమ్.

మటర్ స్పైసీ దాల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

పచ్చిబఠానీలు ఒక కప్పు, టమోటా ముక్కలు అరకప్పు, పచ్చిమిర్చీ మూడు, అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్, మీగడ ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, గరం మసాలా అర టీ స్పూన్, ఇంగువ పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా.

make this dish with green peas which helps thyroid patients

తయారు చేసే విధానం..

ముందుగా మిక్సీజార్ తీసుుకుని అందులో పచ్చిబఠానీ వేసి ముక్క‌చెక్కలా గ్రైండ్ చేయండి. దాన్ని బౌల్ లో వేసుకుని పక్కనపెట్టండి. మళ్లీ మిక్సీజార్ లో పచ్చిమిర్చి ముక్కలు, టమోటా ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేయండి. చిన్న సైజ్ ప్రజర్ కుక్కర్ తీసుకుని పొయ్యిమీద పెట్టి.. అందులో మీగడ వేసి జీలకర్ర, అల్లం తురుము, కరివేపాకు, ఇంగువపొడి, ధనియాల పొడి, గరం మసాల, పసుపు వేసి మీగడలో కొద్దిసేపు వేగనివ్వండి. ఆ తర్వాత..ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిబఠానీ పేస్ట్ వేసి తిప్పండి. టమోటా పేస్ట్ కూడా వేసి ప్రజర్ కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడకనివ్వండి. ఆ తర్వాత మూత తీసేసి.. లెమన్ జ్యూస్ వేసి ఫైనల్ గా కొత్తిమీర చల్లేసి తీసేయడమే.. మటర్ స్పైసీ దాల్ రెడీ. త్వరగా డైజెషన్ అవుతుంది. ఒక్కోసారి పొట్టగడబిడగా ఉండి ఏం తినాలనిపించదు.. అలాంటప్పుడు ఇది చేసుకుని తింటే.. పొట్ట క్లీన్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇది ట్రై చేయండి.

Admin

Recent Posts