food

ఆరోగ్యకరమైన పుదీనా చట్నీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయనే విషయం మనకు తెలిసిందే&period; ఈ క్రమంలోనే మనం చేసే వివిధ రకాల వంటలలో పుదీనా ఆకులను వేసి చేస్తుంటాము&period; ఇవి వంటలకు రుచిని&comma;మంచి సువాసనను అందించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది&period; మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పుదీనా చట్నీ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా ఆకులు రెండు కప్పులు&comma; ఎండుమిర్చి 6&comma; జీలకర్ర టేబుల్ స్పూన్&comma; ఉప్పు తగినంత&comma; కరివేపాకు రెండు రెమ్మలు&comma; పసుపు చిటికెడు&comma; కొబ్బరి ముక్కలు అర కప్పు&comma; వేరుశెనగపప్పు అర కప్పు&comma; నూనె తగినంత&comma; పోపు దినుసులు టేబుల్ స్పూన్&comma; చింతపండు నిమ్మ పండు సైజ్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64855 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pudina-chutney&period;jpg" alt&equals;"pudina chutney recipe how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి&period; అదేవిధంగా వేరుశెనగపప్పుని కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి&period; ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక నిమిషం పాటు పుదీనా ఆకులను వేయించుకోవాలి&period; ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు&comma; వేరుశెనగపప్పు&comma; తగినంత ఉప్పు&comma; ముందుగా వేయించి పెట్టుకొన్న ఎండు మిర్చి&comma; జీలకర్ర&comma; కరివేపాకు&comma; చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి&period; చివరిగా ముందుగా వేయించుకున్న పుదీనా ఆకులను వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి&period; ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పుదీనా చట్నీకి కాస్త పోపు పెట్టుకుంటే ఎంతో రుచి కరమైన పుదీనా చట్నీ తయారైనట్లే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts