భేషుగ్గా ఏ మోమాటము లేకుండా తినవచ్చునండీ, పూరీలు బజ్జీలు తినండి , మనమేమి కుంభాలు కుంభాలుగా ఏమి తినము కదండీ, మనం తినే తిండికి ఏమి కాదండి ! డాక్టర్ లు చెప్పేది ఇదే అన్నీ తినండి ఆరోగ్యంగా ఉండండి. గమనించండి మన మైదా పిండి మీద నూనెల మీద చాలా అపోహలు ఏర్పరుచుకున్నాము , మైదా కంటే గోధుమపిండి మేలైనవనే ఒప్పుకున్నా, వెనకటిలా గోధుమలు మఱాడించిన పిండిని కాకుండా,ఇపుడు చాలా మంది ప్రాసెస్ చేసిన ప్యాకెట్ గోధుమ పిండీ అనే మైదా కంటే అధ్వాన్నపు పిండిని ,కలగలుపుల పిండిని,అయోమయపు పిండిని, పొట్లంలో ఏ రకం పిండి ఉన్నదో తెలియని పిండి వాడుతున్నాము,
అలా పట్టింపులు మొదలుపెడితే బియ్యం పాలీష్ వి అంటారు, టీ-కాఫీలు లో కెఫైన్ ఉందంటూ ఇక చక్కెర,ఉప్పు దూరం దూరం అంటారు. కానిమానాన్న శరీరంలో ఉప్పు( sodium) తక్కువయిందని చనిపోవడానికి అది కూడా వక కారణమని డాక్టర్ లు చెప్పారు. మా పెద్దబ్బాయి కి పెరుగు వాసనగూడా పడదు, మా ఆవిడ ఆలుగడ్డ తింటే కాళ్ల నొప్పులని, వంకాయ అసలే పడదని, టమాటో, నిమ్మకాయ తినడం వదలేయండి వాసన చూసిన తలనొప్పి అని తలకు బట్ట చుట్టుకుం టుంది,ఇలా ఆరోగ్యానికి మంచివి అని అందరు ఒప్పుకున్నవే ఐనను, గుప్పెడు మాత్రలు మింగుతుంది !! అయ్యా ఆరోగ్య సమస్యలు వస్తాయా అని కదా, అడిగారు ఐతే ఉప్పు తింటే ఉష్ణం- పప్పు తింటే పైత్యం.. అనే సామెత లా – ఏమి తిన్న అజీర్ణం తో ఆపసోపాలు పడేవాళ్లకు ఏమి చెప్పలేము, ఏమి చెయ్యలేము ,
అందరు ఎందులకో మన సాంప్రదాయక కమ్మనైనా వంటలపైన అతిగా లెక్కలు కడతారు, మన వంటకాలలో కమ్మటి రుచులు గల హోటల్ బిర్యానీలు లా విదేశాలలో లా, జంతు సంబంధమైన నూనెలు వాడము, నూనెలు లేదా కనీసము నేతి తోనైనా తయారీ చేసే మన నూనె వంటలు ఆరోగ్యానికి శ్రేష్టమైనవే , విదేశీ వంటలు వందకు నూరు శాతంగా మైదా , కాదా ? లెబనాన్ హుమ్మూస్ గమనించండి – చీఝ్ బట్టర్ లు,మైదావే గమనించండి, ఇటాలియన్ మైదా తో రకరకాల కుకీస్ లు , పిజ్జాలు, బర్గర్ లు ఢోనట్ లు , బ్రెడ్ ల తయారీలు. అమెరికన్ బ్రేక్ పాస్ట్ , సిరపులు, పంచదారలు బాబోయ్ అనకండీ, పశ్చిమ దేశాల వారు ఎన్నో పరిశోధనలు చేసి మనకు చేరవేసే సంగతులు వినే మనము , వారిలో 42% కంటే ఎక్కువ మంది ఒబెసిటీ తో ,200–400 పౌండ్ల వరకు తమ బరువు లతో జీవిస్తున్నారని ఎందుకు గమనించము?
నిజం చెప్పుతాను, మీరు బాధ పడొద్దు,విదేశాలలో ఎక్కువ శాతం కనీసం పంది క్రొవ్వు లేదా భీఫ్ క్రొవ్వులతో వండినవే అని ఎంతమందికి తెలుసు? మేం శాఖాహారమే తీసుకుంటున్నామని ధీమగా ఉండొద్దండీ,అన్నీ కాదు ఇంచుమించు చాలా వాటితో ఇచ్చే టేస్టీ సాస్ లు, చట్నీల్లాంటి వాట్లలో పంది లేదా బీఫ్ సూపు లతో కొవ్వులతోనే చేస్తారండి( ఒకటికి రెండు సార్లు NV ఏది కలుపలేదని ధృవీకరించుకొని తీసుకోవాలి) అని తమకు తెలిసి కొందరు ,మీరు ఇది నమ్మాలి తెలియక అందరము చక్కగా, కమ్మగా,షోగ్గా, అధునికమనుకుని మరియు ఘనమైన అలవాటు పడి స్వాహా చేస్తుండే.
వాటి తో మరియు విదేశీయులతో పోలిస్తే మన పూరీలు బజ్జీలు మరియు మన తెలుగు సంప్రదాయక వంటలు తక్కువ క్రొవ్వును కలిగి ఉంటాయి , మన వంటలు ప్రత్యేక సంధర్భాలకు మరియు పండుగలకే ప్రత్యేకంగా చేసుకుని పదిమందితో వేడుకగా తింటాం , మనవి పాస్ట్ ఫుడ్ లలాగా దినాం తినం, మన వంటలు అన్నియును ఆరోగ్యకరమైన , మరియు స్వచ్ఛమైన దినుసులనే ఉపయోగిస్తాము,దినుసులు అన్నీ ఆరోగ్యానికి ఏదో ఒక మేలు చేసేటివేనండీ!!! ప్రతిరోజు సాధారణమైన ఆహారమే రెండు- మూడు పూటలు తీసుకుంటాము కదా, మనము తినే పదార్థములు తినదగినవే తింటాము, ఇది తినవద్దు, అది తినవద్దు అన్నది చదవడానికే అని అర్థం,
నిజానికి మనలో సగటు ఆరోగ్యము తో ఉన్నవాల్లము కుదిరితే రోజు ఒక హద్దు( LIMITED) గా తిన్నను ఏమి కాదనడానికి, మా ఇంట్లో పూరీలు,పెరుగు బజ్జీలు లాంటి Deep fries and fries వారానికి ఒక్కసారైనా వండుతున్న ది, తింటున్న మా వాండ్లు, ఇంకా అరువై ఆరు ఏండ్ల వాడను ఉదాహరణగా ఉన్నాను !! కాబట్టి అన్నీ తినండి- మితంగా తినండి. అనుమానము పాత రోగము- అనుమానంగా ఏది తినకండి ?? తిన్టే ?? అమృతం కూడ విషమౌతుంది. మధ్యాహ్నపు భోజనం చక్కగా మీకు నచ్చినవి తినండి !!! తక్కువ లేదా సగం కడుపు కే 5- 7 గంటల మధ్య రాత్రి భోజనం చేయండి. ప్రతిరోజు ప్రొద్దుట ఆకలితో నిద్ర లేవండి. ఇదొక్కటి లేదా ఇదే పాటించండి (నేనింతే), మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే అన్ని తినవచ్చు అని దానర్థం. ఇంకోలా చెప్పమంటే అన్నీ తింటున్నారంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం !!