food

రుచికరమైన తోటకూర వేపుడు తయారీ విధానం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తాజా ఆకు కూరలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అన్న సంగతి మనకు తెలిసిందే&period; ఈ క్రమంలోనే ఆకుకూరలను తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు&period; మరి ఎన్నో పోషక విలువలు కలిగిన తోటకూర వేపుడు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజా తోటకూర రెండు కట్టలు&comma; ఉల్లిపాయ ముక్కలు&comma; వెల్లుల్లి రెబ్బలు పది&comma; కారం టేబుల్ స్పూన్&comma; పసుపు చిటికెడు&comma; కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు&comma; పప్పుల పొడి రెండు టేబుల్ స్పూన్లు&comma; నూనె తగినంత&comma; శనగపప్పు 1 స్పూన్&comma; మినప్పప్పు 1 స్పూన్&comma; ఉప్పు తగినంత&comma; కొద్దిగా నీరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64383 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;thotakura-vepudu&period;jpg" alt&equals;"thotakura vepudu recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా తోటకూరను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి&period; ఆ తరువాత స్టవ్ మీద కడాయి ఉంచి కొద్దిగా నూనె వేయాలి&period; నూనె వేడి అయిన తర్వాత పోపు దినుసులు&comma; శనగపప్పు&comma; మినపప్పు వేసి వేయించాలి&period; ఇది కొద్దిగా ఎరుపు రంగులోకి రాగానే ఉల్లిపాయ ముక్కలు&comma; వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి&period; ఉల్లిపాయలు ఎర్రపడ్డాక అందులోకి ముందుగా తరిగిపెట్టుకున్న తోట కూర వేసి బాగా కలియబెట్టాలి&period; కాసేపు మూత పెట్టి ఉడికించాలి&period; ఐదు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నీటిని వేసి తగినంత ఉప్పు వేసి మరోమారు కలియబెట్టి మూత పెట్టాలి&period; ఇలా చేయటంవల్ల ఆకు తొందరగా మెత్తబడుతుంది&period;ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలియబెట్టి చిటికెడు పసుపు వేసి ఉడికించాలి&period;నీరు మొత్తం ఇంకిపోయిన తరువాత కారం వేసి సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు వేయించాలి&period;కారం బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి&comma; పప్పుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన&comma; ఆరోగ్యకరమైన తోటకూర వేపుడు తయారైనట్లే&period; ఈ తోటకూర వేపుడు చపాతీ పూరీ వంటివాటిలో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts