Covid Cases Today : కొద్దిగా త‌గ్గిన కొత్త క‌రోనా కేసుల సంఖ్య‌.. అయినప్ప‌టికీ తీవ్ర‌త ఎక్కువే..!

Covid Cases Today : దేశంలో కరోనా మూడో వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త వారం రోజుల నుంచి రోజువారిగా పెరుగుతున్న క‌రోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటోంది. ఈ క్ర‌మంలోనే గ‌డిచిన 24 గంట‌ల్లో మొత్తం 1,68,063 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 6.5 శాతం త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ మొత్తంగా చూస్తే కేసుల‌ సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. మంగ‌ళ‌వారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

Covid Cases Today reduced a little but severity is there

ఇక దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,58,75,790కి చేరుకుంది. క‌రోనా కేసుల సంఖ్య విష‌యంలో మ‌హారాష్ట్ర దేశంలోనే తొలిస్థానంలో ఉంది. అక్క‌డ 33,470 కేసులు న‌మోదు కాగా, ప‌శ్చిమ బెంగాల్‌లో 19,286, ఢిల్లీలో 19,166, త‌మిళ‌నాడులో 13,990, క‌ర్ణాట‌క‌లో 11,698 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల్లో ఈ రాష్ట్రాల్లో న‌మోదైన కేసుల సంఖ్యే 58.08 శాతంగా ఉంది. కేవ‌లం మ‌హారాష్ట్ర‌లోని కేసుల సంఖ్యే 19.92 శాతంగా ఉంది.

గ‌డిచిన 24 గంట‌ల్లో 277 మంది చ‌నిపోగా మొత్తం కోవిడ్ మ‌ర‌ణాల సంఖ్య 4,84,213కు చేరుకుంది. కోల్‌క‌తాలో 166, ఢిల్లీలో 17 మంది కొత్త‌గా చ‌నిపోయారు. దేశంలో కోవిడ్ రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 96.36 శాతంగా ఉంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 69,959 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,45,70,131కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 8,21,446గా ఉంది. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో యాక్టివ్ కేసుల సంఖ్య 97,827కి పెరిగింది.

వ్యాక్సిన్ల పంపిణీ విష‌యానికి వ‌స్తే గ‌డిచిన 24 గంట‌ల్లో 92,07,700 డోసుల‌ను ఇచ్చారు. దీంతో మొత్తం ఇచ్చిన డోసుల సంఖ్య‌, 1,52,89,70,294కి చేరుకుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 15,79,928 శాంపిళ్ల‌ను ప‌రీక్షించారు. దేశంలో ప్ర‌స్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,461గా ఉంది. కాగా జ‌న‌వ‌రి 10వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా వృద్ధుల‌కు, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి, ఫ్రంట్ లైన్ సిబ్బందికి, హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు బూస్ట‌ర్ డోసుల‌ను ఇవ్వ‌డం ప్రారంభించారు.

Share
Admin

Recent Posts