హెల్త్ టిప్స్

మన శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించే 3 రకాల టీలు

మన దేశంలో ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగితే కానీ రోజు గడవదు. ఈ విధంగా ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు టీ తాగిన తర్వాత మన రోజువారి కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఒక అధ్యయనం ప్రకారం భారత దేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 8,37,000 టన్నుల టీ వినియోగిస్తున్నట్లు తేలింది. అయితే రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఎన్నో సుగంధద్రవ్యాలతో తయారు చేసుకున్న టీని తాగడం వల్ల మనకు ప్రశాంతత కలగడమే కాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అయితే మరి మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన టీ ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

శిలాజిత్ టీ

హిమాలయాలలో ఎత్తైన ప్రదేశాలలో పెరిగే తారు లాంటి పదార్థం శిలాజిత్‌. దీని ద్వారా తయారు చేసుకున్న టీని తాగటం వల్ల మనకు బలాన్ని, దృఢత్వాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ టీ దోహదపడుతుంది. ముఖ్యంగా ఈ టీలో ఎక్కువ భాగం శొంఠి, అశ్వగంధ, జాపత్రి వంటి ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడి ఉంటుంది. ప్రతిరోజు ఈ టీని తాగడం వల్ల మనస్సు ప్రశాంతత కలిగి ఉండటమే కాకుండా, కంటిచూపును మెరుగుపరుస్తూ, అజీర్తి సమస్యలను తొలగించడానికి దోహదపడుతుంది.

ఫ్రూట్‌ టీ

పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం పండ్లలో ఉన్నటువంటి పోషకాలు మనకు టీ రూపంలో లభ్యమవుతున్నాయి. వివిధ రకాల పండ్ల ఫ్లేవర్ లతో అనగా.. స్ట్రాబెర్రీ, మామిడి, పుచ్చకాయ, నారింజ వంటి ఫ్లేవర్ లతో టీలు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ విధమైనటువంటి టీలలో ప్రొటీన్లు, విటమిన్లు ఉండటమే కాకుండా అద్భుతమైన రుచిని కలిగి ఉండి మన శరీరంలో ఏర్పడిన ఒత్తిడి నుంచి మెదడుకు, శరీరానికి ప్రశాంతతను కల్పిస్తాయి.

పసుపు టీ

మన భారతీయ వంటలలో ఎక్కువగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో పసుపు ఒకటి. పసుపులో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ ఫ్లామేటరీ గుణాలు దాగి ఉన్నాయి. నిత్యం పసుపును తీసుకోవడం వల్ల మన శరీరంలో వివిధ రకాల జబ్బులను నయం చేయడమే కాకుండా శరీర బరువును తగ్గడానికి కూడా దోహదపడుతుంది. ఎన్నో ప్రయోజనాలు కలిగిన పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. మన రోజువారి టీ లో భాగంగా పసుపును జోడించి తాగడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Sailaja N

Recent Posts