Almond Oil : బాదంనూనెను తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే 10 అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Almond Oil : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రైఫ్రూట్స్ లో బాదంప‌ప్పు కూడా ఒక‌టి. బాదంప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వైద్యులు చెప్ప‌డంతో వీటిని చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. అలాగే బాదంప‌ప్పుతో పాటుగా చాలా మంది బాదంనూనెను కూడా వాడుతూ ఉంటారు. బాదంగింజ‌ల నుండి తీసే బాదం నూనెలో కూడా ఎన్నో పోష‌కాలు ఉంటాయి. బాదం నూనెలో విట‌మిన్ ఎ, ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. రోజూ ఒక టీ స్పూ్ బాదం నూనెను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. బాదం నూనెను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలేమిటో… అస‌లు దీనిని ఎందుకు ఆహారంలో భాగంగా తీసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం నూనెలో కొవ్వులు, ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. మ‌న‌కు క‌డుపు నిండిన భావ‌న‌ను క‌లిగించ‌డంలో ఇది స‌హాయ‌ప‌డుతుంది. బాదం నూనెను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బాదంనూనెను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చ‌ర్మం పొడిబార‌కుండా తేమ‌గా ఉంటుంది. చ‌ర్మం యొక్క ఛాయ మెరుగుప‌డుతుంది. అలాగే బాదం నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. బాదంనూనెను తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. అల్జీమ‌ర్స్ వంటి మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో కూడా బాదం నూనె మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. బాదంనూనెను తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టుకు కావ‌ల్సిన పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి. అలాగే ఈ నూనెను జుట్టు కుదుళ్ల‌ల్లోకి ఇంకేలా మ‌ర్ద‌నా చేసుకోవ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే బాదం నూనెలో క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోష‌కాలు కూడా ఉంటాయి. ఈ నూనెను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతాయి. ఎముక‌ల సాంద్ర‌త పెరుగుతుంది.

Almond Oil 10 wonderful health benefits if you consume it
Almond Oil

అలాగే బాదంనూనెను తీసుకోవ‌డం వ‌ల్ల ప్రేగుల్లో క‌ద‌లిక‌లు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. పొట్ట ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మ‌ధుమేహం ఉన్న‌వారు బాదంనూనెను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో బాదంనూనె ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే బాదంనూనెలో యాంటీ ఆక్సిడెంట్లు,పాలీఫినాల్స్ ఉంటాయి. ఈ నూనెను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే తామ‌ర‌, స్కాల్ప్ పోరియాసిస్, ప్లాకీ సోరియాసిస్ వంటి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా బాదంనూనెను మ‌న‌కు స‌హాయ‌క‌రంగా ఉంటుంది. బాదంనూనెలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. శ‌రీరంలో వాపు, మంట‌, నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో బాదంనూనె ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఈ విధంగా బాదం నూనె మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని కూడా ఆహారంలో భాగంగా తీసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts