Almonds Powder For Eyes : రోజూ ఒక్క టీస్పూన్ చాలు.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసిపారేస్తారు..!

Almonds Powder For Eyes : నేటి త‌రుణంలో కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకు ఎక్కువ‌వుతున్నారు. కంటి నుండి నీళ్లు కారడం, కంటి చూపు మంద‌గించ‌డం, కళ్ల మంట‌లు, క‌ళ్లు మ‌స‌క‌మ‌స‌క‌గా క‌నిపించ‌డంక‌ళ్ల నొప్పులు వంటి వివిధ ర‌కాల కంటి స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. పోష‌కాహార లోపం, ప‌దే ప‌దే సెల్ ఫోన్ ల‌ను వాడ‌డం, కంప్యూట‌ర్ ల‌ను ఎక్కువ‌గా చూడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత కంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఇటువంటి కంటి స‌మ‌స్య‌లన్నింటిని మ‌నం చ‌క్క‌టి చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల న‌యం చేసుకోవ‌చ్చు. మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు.

అలాగే ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం వాడ‌డం కూడా చాలా సుల‌భం. కంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేసే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. ఎలా వాడాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం తెల్ల మిరియాల‌ను, సోంపు గింజ‌ల‌ను, బాదం ప‌ప్పును, ప‌టిక బెల్లాన్ని, యాల‌కుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ ప‌దార్థాల్లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యంతో పాటు శ‌రీర ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. ముందుగా ఒక గిన్నెలో 50 గ్రాముల సోంపును తీసుకోవాలి. త‌రువాత ఇందులో 50 గ్రాముల బాదం ప‌ప్పు, 10 గ్రాముల తెల్ల మిరియాలు, 10 గ్రాముల యాల‌కులు, 100 గ్రాముల ప‌టిక బెల్లాన్ని తీసుకోవాలి.

Almonds Powder For Eyes know how to use it
Almonds Powder For Eyes

ఇప్పుడు వీట‌న్నింటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పొడిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా త‌యారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో ఒక టీ స్పూన్ మోతాదులో క‌ల‌పాలి. ఈ పాల‌ను రాత్రి ప‌డుకోవ‌డానికి అర గంట ముందు తాగాలి. పిల్ల‌ల‌కు ఉద‌యం అల్పాహారం చేసిన త‌రువాత ఈ పొడిని పాలల్లో క‌లిపి తాగించాలి. ఈ విధంగా ఈ చిట్కాను క్ర‌మం త‌ప్ప‌కుండా నెల రోజుల పాటు పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా కంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.

Share
D

Recent Posts