Almonds With Milk : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పు ఒకటి. బాదం పప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. బాదం పప్పును తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బాదం పప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ వంటి వాటితో పాటు ఇతర అనేక పోషకాలు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇలా అనేక విధాలుగా బాదం పపప్పు మనకు సహాయపడుతుంది. అలాగే మనం ప్రతిరోజూ పాలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. పాలల్లో మన శరీరారినికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇతర పోషకాలు అనేకం ఉంటాయి.
పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బాదం పప్పు మరియు పాలు ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. అయితే వీటిని విడివిడిగా తీసుకోవడం కంటే బాదం పప్పును పాలతో కలిపి బాదం పాలను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదం పాలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బాదం పాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ సమృద్దిగా అందుతాయి. పౌష్టికాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. శాఖాహారులు బాదం పాలను తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలను పొందవచ్చు. పాలను తాగడానికి ఎక్కువగా ఇష్టపడని వారు బాదం పాలను తయారు చేసుకుని తాగవచ్చు. ఇలా బాదం పాలను తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
బాదం పాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో విటమిన్ ఇ లోపం తలెత్తకుండా ఉంటుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. అదే విధంగా బాదం పాలను తాగడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది. దీంతో ఎముకలు ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గు ముఖం పడతాయి. అలాగే ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారు బాదం పాలను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పు బాదం పాలల్లో 39 క్యాలరీల శక్తి ఉంటుంది.
వీటిని తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మన దృష్టి ఇతర చిరుతిళ్ల మీదికి వెళ్లకుండా ఉంటుంది. అదే విధంగా బాదం పాలను తీసుకోవడం వల్ల ప్రేగుల్లో కదలికలు పెరిగి మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీంతో ప్రేగులు మనం తీసుకున్న ఆహారంలో ఉండే పోషకాలను ఎక్కువగా గ్రహిస్తాయి. ఈ విధంగా బాదం పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఈ బాదం పాలను తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని అలాగే జుట్టుకు, చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడే వారు బాదం పాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.