హెల్త్ టిప్స్

Ash Gourd Juice : బూడిద గుమ్మ‌డికాయ జ్యూస్‌.. షుగ‌ర్, కొలెస్ట్రాల్, బీపీ పారిపోతాయి..!

Ash Gourd Juice : చాలా మంది ఈ రోజుల్లో బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిదని తీసుకుంటున్నారు. బూడిద గుమ్మడికాయని తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. బూడిద గుమ్మడికాయలో ఉండే పోషకాల‌ గురించి చాలా మందికి తెలియదు. గుమ్మడికాయలలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. విటమిన్ ఏ, బీ6, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. బూడిద గుమ్మడికాయని తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

బూడిద గుమ్మడికాయలని మనం సూప్స్, సలాడ్స్ లేదంటే కూర వంటివి చేసుకు తీసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయని తీసుకోవడం వలన గ్యాస్, మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో గ్యాస్ట్రో ప్రొటెక్టివ్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మలబద్ధకం, గ్యాస్ సమస్యలకి ఇది మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది.

ash gourd juice many benefits

క‌డుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. బూడిద గుమ్మడికాయను తీసుకోవడం వలన కిడ్నీ సమస్యల నుండి కూడా దూరంగా ఉండొచ్చు. యాంటీ డయారియల్ ఏజెంట్ గా ఇది పని చేస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వాళ్లు కూడా దీనిని తీసుకుంటే మంచిది. ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణని కూడా పొందవచ్చు. గుండెకి కూడా ఇది చాలా మేలు చేస్తుంది.

బూడిద గుమ్మడికాయని తీసుకుంటే, మెదడుకి కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బూడిద గుమ్మడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని, ఎలాంటి నీళ్లు వేసుకోకుండా జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో కొంచెం నిమ్మరసం, అల్లం, మనం చేసుకున్న ఏదైనా మసాలాలు కూడా వేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఉపయోగపడే మసాలాలు ఇంట్లో తయారు చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే వట్టి రసం అయినా తీసుకోవచ్చు. ఇలా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వలన అనేక లాభాలని పొంది ఆరోగ్యంగా ఉండొచ్చు.

Admin

Recent Posts