Bay Leaves Tea Benefits : బిర్యానీ ఆకుల‌తో టీ చేసి రోజూ తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Bay Leaves Tea Benefits : మ‌న వంట‌గ‌దిలో ఉండే మ‌సాలా దినుసుల్లో బిర్యానీ ఆకు కూడా ఒక‌టి. దీనిని ఎంతో కాలంగా మ‌నం మ‌సాలా దినుసుగా ఉప‌యోగిస్తూ ఉన్నాము. ఎక్కువ‌గా నాన్ వెజ్ వంట‌కాల్లో బిర్యానీ ఆకును వాడుతూ ఉంటాము. వంటల్లో బిర్యానీ ఆకు వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌టి రుచి వ‌స్తుంది. అలాగే బిర్యానీ ఆకు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. బిర్యానీ ఆకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అయితే వంట‌ల్లో వాడ‌డానికి బ‌దులుగా బిర్యానీ ఆకుల‌తో టీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉద‌యం టీ, కాఫీల‌ను తాగ‌డానికి బ‌దులుగా బిర్యానీ ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించి వ‌డ‌క‌ట్టి తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా బిర్యానీ ఆకుల టీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బిర్యానీ ఆకుల టీని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. అజీర్తి, గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ప్రేగుల్లో క‌ద‌లిక‌లు పెరుగుతాయి. అలాగే షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారికి కూడా బిర్యానీ ఆకుల టీ ఎంతో మేలు చేస్తుంది. ఈ టీని తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. బిర్యానీ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అదే విధంగా బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి.

Bay Leaves Tea Benefits in telugu must take it daily
Bay Leaves Tea Benefits

క‌నుక ఈ ఆకుల‌తో టీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్స‌ర్, షుగ‌ర్, గుండె జ‌బ్బులు వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఇక బిర్యానీ ఆకుల‌తో టీని తయారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. అదే విధంగా చ‌ర్మానికి కూడా ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. బిర్యానీ ఆకుల టీని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వృద్దాప్య ఛాయ‌లు, ముడత‌లు వంటివి మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఈ విధంగా బిర్యానీ ఆకుల టీ మ‌న ఆరోగ్యానికి , అందానికి ఎంతో మేలు చేస్తుంద‌ని ఈ టీని ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts