Belly Fat Drink : మన ఇంట్లో ఉండే పదార్థాలతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని మీకు తెలుసా.. నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక బరువు సమ్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. అధిక బరువు కారణంగా అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. కనుక ఈ సమస్య నుండి మనం వీలైనంత త్వరగా బయటపడడం చాలా అవసరం. అధిక బరువు, అధిక పొట్ట వంటి సమస్యలతో బాధపడే వారు మనకు సులభంగా లభించే పదార్థాలతో టీ ని తయారు చేసుకుని రోజుకు ఒకసారి తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.
అంతేకాకుండాఈ టీ ని తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అధిక బరువును తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీ పి తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక గ్లాస్ నీటిని, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను, ఒక ఇంచు అల్లం ముక్కను, అర చెక్క నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్క తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా అల్లాన్ని శుభ్రపరిచి మెత్తగా దంచాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా మెత్తగా దంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే అల్లంతో వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి కలపాలి. ఈ నీటిని 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై బాగా మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి.
తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో నిమ్మరసం, తేనె వేసి కలిపి తీసుకోవాలి. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు తేనెను ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న టీని రోజూ ఒకసారి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా తొలగిపోతుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.ఈ టీ ని తాగడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా అధిక బరువుతో బాధపడే వారు అల్లం వెల్లుల్లితో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.