Belly Fat Reducing Tips : ఎంత‌టి బాన పొట్ట అయినా, బ్యాక్ సీట్ అయినా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోవాల్సిందే..!

Belly Fat Reducing Tips : ప్ర‌తి ఒక్క‌రు స‌న్న‌ని నాజుకైనా న‌డుము ఉండాల‌ని పొట్ట లేకుండా అందంగా క‌న‌బ‌డాల‌ని కోరుకుంటారు. కానీ మ‌న‌లో చాలా మందికి పొట్ట ద‌గ్గ‌ర భాగంలో కొవ్వు పేరుకుపోయి అధిక పొట్ట‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇలా పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల, పొట్ట పెర‌గ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. పొట్ట పెర‌గ‌డం వ‌ల్ల శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. నిద్ర‌లేమి తలెత్తుతుంది. మ‌నిషి ఆయుష్షు క్షీణిస్తుంది. శ‌రీరం శ‌క్తిని కోల్పోతుంది. క‌నుక పొట్ట‌ను వీలైనంత త్వ‌ర‌గా త‌గ్గించుకోవాలి. ఇలా అధిక పొట్ట‌తో బాద‌ప‌డే వారు ఇప్పుడు చెప్పే సూత్రాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా ఈ స‌మస్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడే వారు రోజూ సాయంత్రం 6 గంట‌ల లోపే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ భోజ‌నంలో పండ్లు, న‌ట్స్ ను మాత్ర‌మే తీసుకోవాలి. ఉడికించిన ఆహారాల‌ను తీసుకోకూడ‌దు. ఇలా సాయంత్రం భోజ‌నంలో పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రాత్రంతా పొట్ట ఖాళీగా ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి శ‌రీరంలో నిల్వ ఉన్న కొవ్వు నుండి ల‌భిస్తుంది. దీంతో పొట్ట త‌గ్గుతుంది. అలాగే మ‌ధ్యాహ్నం పూట అన్నాన్ని తీసుకోవ‌డం పూర్తిగా మానేయాలి. అన్నానికి బ‌దులుగా రెండు పుల్కాలు లేదా జొన్న రొట్టెల‌ను తీసుకోవాలి. ఈ పుల్కాల‌ను ఎక్కువ కూర‌తో తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

Belly Fat Reducing Tips follow these for better health
Belly Fat Reducing Tips

ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం తీసుకునే క్యాల‌రీల సంఖ్య త‌గ్గుతుంది. అలాగే మ‌నం మ‌న పొట్ట‌ను 85 శాతం పిండేలా మాత్ర‌మే ఆహారాన్ని తీసుకోవాలి. పొట్ట నిండుగా ఆహారాన్ని తీసుకోకూడ‌దు. పొట్ట నిండుగా ఆహారాన్ని తీసుకోవ‌డం వల్ల పొట్ట ఎక్కువ‌గా సాగుతుంది. పొట్ట ఎక్కువ‌గా పెరుగుతుంది. క‌నుక పొట్ట నిండుగా ఆహారాన్ని తీసుకోకూడ‌దు. వీటితో పాటు పొట్ట త‌గ్గించే ఆస‌నాల‌ను వేయాలి. కింద పొట్ట ఎక్కువ‌గా ఉన్న వారు వుత్తానుపాదాస‌నం వేయాలి. నేల మీద నిటారుగా ప‌డుకుని త‌ల కింద చేతులు పెట్టుకుని కాళ్ల‌ను ఒక అడుగు పైకి ఎత్తాలి. ఇలా చేయ‌డం వల్ల కింద పొట్ట తగ్గుతుంది. అలాగే పై పొట్ట ఎక్కువ‌గా ఉన్న వారు నౌకాస‌నం వేయాలి.

ఈ ఆస‌నం కూడా చాలా సుల‌భం. నేల మీద నిటారుగా ప‌డుకుని కాళ్ల‌ని పైకి ఎత్తాలి. అలాగే వీపు భాగాన్ని కింద ఆనించి ఛాతి భాగాన్ని పైకి ఎత్తి ఉంచాలి. చేతుల‌ను కాళ్ల‌పై ఉంచి ప‌డ‌వ ఆకారంలో ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పైపొట్ట త‌గ్గుతుంది. అలాగే వీటితో పాటు సూర్య న‌మ‌స్కారాలు చేయ‌డం కూడా అల‌వాటు చేసుకోవాలి. సూర్య న‌మ‌స్కారాలు చేయ‌డం వ‌ల్ల పొట్ట త‌గ్గుతుంది. న‌డుము స‌న్న‌గా త‌యారవుతుంది. ఈ విధంగా ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును క‌రిగించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts