Paneer Tikka : రెస్టారెంట్ల‌లో ల‌భించే ప‌నీర్ టిక్కా.. ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది..!

Paneer Tikka : మ‌నం ప‌నీర్ తో వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ప‌నీర్ తో చేసుకోద‌గిన స్నాక్స్ రెసిపిల‌ల్లో ప‌నీర్ టిక్కా కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తుంది. స్టాట‌ర్ గా దీనిని తీసుకుంటూ ఉంటారు. ప‌నీర్ టిక్కా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా ఇష్టంగా తినాల్సిందే. అంత రుచిగాఉంటుంది ఈ పనీర్ టిక్కా. ఈ ప‌నీర్ టిక్కాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్, స్పెష‌ల్ డేస్ లో ఇలా వెరైటీగా ప‌నీర్ టిక్కాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ప‌నీర్ టిక్కాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌నీర్ టిక్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెరుగు – అర క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి -పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, తందూరి మ‌సాలా లేదా గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, క్యూబ్స్ లాగా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, క్యూబ్స్ లాగా తరిగిన క్యాప్సికం – పెద్ద‌ది ఒక‌టి, ముక్క‌లుగా త‌రిగిన ప‌నీర్ – 200 గ్రా..

Paneer Tikka recipe make it in restaurant style
Paneer Tikka

ప‌నీర్ టిక్కా త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో పెరుగును తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉల్లిపాయ‌, క్యాప్సికం, ప‌నీర్ త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క్యాప్సికం ముక్క‌లు, ప‌నీర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత టూత్ పిక్స్ ను తీసుకుని వాటికి ముందుగా ఉల్లిపాయ‌ను గుచ్చాలి. త‌రువాత ప‌నీర్ ను, ఆ త‌రువాత క్యాప్సికం ను గుచ్చాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌నీర్ స్టిక్స్ ను క‌ళాయిలో ఉంచి వేయించాలి. వీటిపై కొద్దిగా నూనె వేసుకుంటూ అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ టిక్కా త‌యారవుతుంది. దీనిని గ్రీన్ చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే చాలాసుల‌భంగా ప‌నీర్ టిక్కాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని తీసుకోవ‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts