Blood Cleanse : మన శరీరంలో అనేక అవయవాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కొన్ని బాహ్యంగా కనిపించేవి అయితే కొన్ని లోపల ఉంటాయి. ఇవన్నీ మనకు అవసరమే. ఏ ఒక్క అవయవం సరిగ్గా పనిచేయకపోయినా మనకు వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఈ అవయవాలు అన్నీ సూక్ష్మమైన కణాలు, కణజాలాలతో నిర్మాణం అయి ఉంటాయి. వీటికి రక్తం ద్వారా పోషకాలు, ఆక్సిజన్, శక్తి అందుతాయి. అయితే మనం తినే ఆహారం, తాగే ద్రవాలు, పలు ఇతర కారణాల వల్ల మన శరీరంలోని రక్తంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఇవి ఎప్పటికప్పుడు బయటకు పోతూనే ఉంటాయి.
కానీ కొందరిలో వ్యర్థాలు రక్తంలో పేరుకుపోతుంటాయి. దీంతో వ్యర్థాలు పేరుకుపోవడం మూలంగా మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి క్రమంగా తీవ్రతరం అయి ప్రాణాల మీదకు వస్తుంది. అప్పుడు ప్రాణాలే పోతాయి. కనుక అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకు గాను రక్తాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ క్రమంలోనే పలు ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల రక్తం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది. దీంతో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. ఫలితంగా అనారోగ్య సమస్యలు కూడా రావు. అయితే రక్తం శుభ్రం అవ్వాలంటే.. ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తాన్ని శుభ్రపరచడంలో మనకు బీట్ రూట్ ఎంతగానో సహాయ పడుతుంది. దీంట్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తాయి. కొత్తగా రక్తం తయారయ్యేందుకు సహకరిస్తాయి. కనుక బీట్‌రూట్‌ను రోజూ తినాలి. రోజూ ఉదయం పరగడుపున ఒక కప్పు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగితే రక్తం బాగా పెరుగుతుంది. రక్తశుద్ధి అవుతుంది. బీట్‌రూట్‌ను రోజూ తింటే ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కనుక రక్తం శుభ్రం అయ్యేందుకు రోజూ దీన్ని తప్పకుండా తీసుకోవాలి.
రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగాలి. దీనివల్ల కూడా రక్త శుద్ధి అవుతుంది. అలాగే లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోయి లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ఉసిరికాయ జ్యూస్‌తో పలు ఇతర లాభాలను కూడా పొందవచ్చు.
బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది డిటాక్సిఫైయింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కనుక రోజూ రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను తినాలి. ఇది రక్తం పెరిగేలా చేస్తుంది. రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటాం.
రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగు లేదా ఐదు వేపాకులను తింటే శరీరం మొత్తం శుభ్రమవుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతోపాటు నిమ్మరసం కూడా పనిచేస్తుంది. అలాగే రక్తం శుద్ధి అవ్వాలంటే తేనె, వేడి నీళ్ల మిశ్రమాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక దీంతోపాటు రోజూ సరైన సమయానికి భోజనం చేయడం, తగినన్ని గంటల పాటు నిద్రించడం వల్ల కూడా రక్తం శుభ్రంగా మారుతుంది. దీంతోపాటు శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు పోతాయి. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో ఎల్లప్పుడూ రోగాలు రాకుండా ముందుగానే జాగ్రత్తగా ఉండవచ్చు. ఇలా రక్తాన్ని శుభ్రం చేసుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు.