Eye Sight : కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ చేసే వారి సంఖ్య ఎక్కువవుతోంది. దీని వల్ల లాప్ టాప్ లలో, సెల్ ఫోన్ లలో, కంప్యూటర్ లలో పని చేసుకోవాల్సి వస్తోంది. తరచూ ఈ స్క్రీన్స్ పై ఉండే చిన్న అక్షరాలను ఎక్కువగా చూడడం వల్ల కంటిలో ఉండే రెటీనా దెబ్బ తింటోంది. దీని వల్ల కంటి చూపు మందగిస్తోంది. అందరూ అద్దాలను వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే మనం తినే ఆహారం వల్ల మన కంటి చూపు మెరుగు పడుతుంది. విటమిన్ ఎ, విటమిన్ సి ఎక్కువగా కలిగిన కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, కీర దోస, బూడిద గుమ్మడి, సొర కాయ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. వీటితోపాటు ఈ చిట్కాలను పాటిచడం వల్ల కూడా కంటి పై ఒత్తిడి తగ్గి రెటీనా దెబ్బ తినకుండా ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. వర్క్ ఫ్రం హోమ్ చేసే వారు వర్క్ చేసుకుంటూ మధ్యాహ్న భోజనాన్ని స్పూన్ తో తినేసేయాలి. లంచ్ బ్రేక్ లో కొద్ది సమయం నిద్ర పోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు విశ్రాంతి కలిగి రెటీనా దెబ్బ తినకుండా ఉంటుంది. వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఉన్న వాళ్లు ఇలా చేయడం వల్ల కంటి చూపు దెబ్బ తినకుండా ఉంటుంది. ఆఫీసుల్లో పని చేసే వారు లంచ్ చేశాక కొద్ది సమయం పాటు కళ్లు మూసుకుని ఉండాలి. ఇలా చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
2. టిష్యు పేపర్ లేదా వస్త్రాన్ని చల్లటి నీళ్లతో తడిపి 5 నిమిషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కంటికి కలిగే ఒత్తిడి తగ్గి రెటీనా దెబ్బ తినకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కళ్లు ఎరుపుగా అవ్వడం, కళ్ల మంట వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
3. రోజూ 6 గంటల నిద్ర శరీరంలోని ఇతర అవయవాలకు సరిపోతుంది. కానీ కళ్లకు 7 నుండి 8 గంటల నిద్ర అవసరమవుతుంది. కనుక వీలు దొరికినప్పుడల్లా కొద్ది నిమిషాల పాటు కళ్లు మూసుకుని ఉండాలి. దీంతో కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. ఇది కళ్ల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది.
ఇక ఈ చిట్కాలతోపాటు విటమిన్ ఎ, విటమిన్ సి కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రెటీనా దెబ్బ తినకుండా ఉంటుంది. కంటి చూపు ఎక్కువ కాలం ఉంటుంది.