Black Gram For Anemia : వీటిని తింటే ర‌క్తం బాగా ప‌డుతుంది.. ఎముక‌ల్లో గుజ్జు పెరుగుతుంది..

Black Gram For Anemia : మ‌నం ఉద‌యం పూట ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ అల్పాహారాల్లో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి హానిని క‌లిగించే అల్పాహారాలు కూడా ఉంటాయి. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం అన‌గానే అంద‌రికి ముందుగా గుర్తుకు వ‌చ్చేది ఇడ్లీ. దీనిని త‌యారు చేయ‌డానికి నూనెను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌రు, అలాగే ఇది చాలా తేలిక‌గా జీర్ణ‌మ‌వుతుంది అని చాలా మంది భావిస్తారు. కానీ ఇడ్లీ కంటే మిన‌పప్పుతో చేసే గారెలు, వ‌డ‌లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ అల్పాహారాల్లో ఎటువంటి ఇత‌ర ప‌దార్థాలు క‌ల‌ప‌కుండా కేవ‌లం మిన‌ప‌ప్పుతోనే తయారు చేస్తాము. మిన‌ప‌ప్పులో ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువ‌గా కార్బోహైడ్రేట్స్ త‌క్కువ‌గా ఉంటాయి. ఈ అల్పాహారాల‌ను పొట్టు మిన‌ప‌ప్పుతో త‌యారు చేసుకుంటే తగినంత ఫైబ‌ర్ మ‌న శ‌రీరానికి అందుతుంది.

దీంతో మ‌నం మ‌రిన్ని అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారికి, ఊబ‌కాయంతో బాధ‌ప‌డే వారికి, ర‌క్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజ‌రాయిడ్స్ ఎక్కువ‌గా ఉన్న‌వారికి మిన‌పప్పు గారెలు చాలా మంచి ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. మిన‌ప గారెలు తీసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ల‌న్నీ కూడా నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ఇడ్లీల‌ను తిన‌డం వ‌ల్ల ఇటువంటి స‌మ‌స్య‌ల‌న్నీ మ‌రింత తీవ్రం అవుతాయి. అయితే ఈ మిన‌ప‌గారెల‌ను నూనెలో వేయించి తిన‌డం వ‌ల్ల ఆరోగ్యాన్ని పొంద‌డానికి బ‌దులుగా మ‌నం అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. నూనె లేకుండా ఈ మిన‌ప‌గారెల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Black Gram For Anemia how to take them regularly
Black Gram For Anemia

మిన‌ప‌గారెల‌ను ఆరోగ్యానికి మేలు చేసేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మిన‌ప‌ప్పు లేదా మిన‌ప‌గుళ్ల‌ను పొట్టుతో స‌హా నాన‌బెట్టుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పిండిలో ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, అల్లం ముక్క‌లు, జీల‌క‌ర్ర‌, అర చెక్క నిమ్మ‌ర‌సం, 2 టీ స్పూన్ల తేనె వేసి క‌ల‌పాలి. త‌రువాత పెనం మీద కొద్దిగా మీగ‌డ రాసి మీగ‌డ వేడైన త‌రువాత త‌గినంత పిండిని తీసుకుని ప‌లుచ‌గా గారెను వ‌త్తుకుని కాల్చుకోవాలి. ఈ గారెను రెండు వైపులా మీగ‌డ రాస్తూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. అలాగే ఎలక్ట్రిక్ ఒవెన్ లో, నాన్ స్టిక్ గ్రిల్స్ మీద కూడా ఇలా గారెల‌ను కాల్చుకోవ‌చ్చు. ఇలా మీగ‌డ‌తో త‌యారు చేసిన గారెల‌ను వేడిగా తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు మెత్త‌గా కూడా ఉంటాయి. అలాగే ఈ గారెల‌ను త‌క్కువ నూనె, ఉప్పు వాడి త‌యారు చేసిన అల్లం చ‌ట్నీలో పెరుగు క‌లిపి తీసుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న గారెల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ప్రోటీన్లు ఎక్కువ‌గా అందుతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి, డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారికి ఇలా త‌యారు చేసిన గారెలు మంచి ఆహారమ‌ని నిపుణులు చెబుతున్నారు. బ‌రువు త‌క్కువ‌గా ఉండి డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు ఈ గారెల‌ను కొబ్బ‌రి చ‌ట్నీతో తీసుకోవ‌డం మంచిది. నూనెలో వేయించి త‌యారు చేసిన గారెల‌ల్లో పోష‌కాలు త‌గ్గుతాయి. హాని క‌లిగించే ఫ్రీరాడిక‌ల్స్ ఎక్కువ‌గా త‌యారవుతాయి. క‌నుక ఇలా మీగ‌డ‌తో త‌యారు చేసుకున్న గారెల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts