Black Salt Water : న‌ల్ల ఉప్పు నీళ్ల‌ను తాగితే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Black Salt Water : న‌ల్ల ఉప్పు దీన్నే బ్లాక్ సాల్ట్ అని హిందీలో కాలా న‌మ‌క్ అని అంటారు. భార‌తీయ సంప్ర‌దాయ ఆయుర్వేద వైద్యంలో ఎంతో పురాత‌న కాలం నుంచి న‌ల్ల ఉప్పును ఉప‌యోగిస్తున్నారు. స‌ముద్ర‌పు నీళ్ల‌ను ఆవిరి చేసి ఈ ఉప్పును త‌యారు చేస్తారు. అందువ‌ల్ల ఈ ఉప్పులో సోడియం క్లోరైడ్‌, పొటాషియం, మెగ్నిషియం, ఐర‌న్ వంటి మిన‌రల్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఈ ఉప్పును వాడ‌డం వ‌ల్ల వంట‌కాల‌కు రుచి పెర‌గ‌డ‌మే కాదు, దీంతో మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌క‌రమైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే న‌ల్ల ఉప్పు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. న‌ల్ల ఉప్పు మ‌న శ‌రీరంపై చ‌ల్ల‌ని ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ఇది పొట్ట‌ను చ‌ల్ల‌గా ఉంచుతుంది. అలాగే అనేక వ్యాధుల‌ను త‌గ్గిస్తుంది. న‌ల్ల ఉప్పులో లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఇది మెట‌బాలిక్ రేటును పెంచుతుంది. దీంతో రోజూ సుఖ విరేచ‌నం అవుతుంది.

న‌ల్ల ఉప్పు లివ‌ర్‌ను డిటాక్స్ చేయ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. న‌ల్ల ఉప్పు లివ‌ర్‌లో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తుంది. అలాగే లివ‌ర్‌ను సుర‌క్షితంగా ఉంచుతుంది. లివ‌ర్ వ్యాధులు రాకుండా చూస్తుంది. న‌ల్ల ఉప్పు మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను కూడా బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. న‌ల్ల ఉప్పు నీళ్లు చ‌ర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి ర‌క్తాన్ని శుద్ధి చేస్తాయి. న‌ల్ల ఉప్పు నీళ్ల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. దీంతో పైల్స్ నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే అసిడిటీ స‌మ‌స్య త‌గ్గుతుంది.

Black Salt Water many wonderful health benefits
Black Salt Water

న‌ల్ల ఉప్పు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఏవీ ఉండ‌వు. ముఖ్యంగా గుండెల్లో మంట‌, అజీర్తి త‌గ్గుతాయి. అయితే న‌ల్ల ఉప్పు నీళ్ల‌లో కాస్త నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి కూడా తాగ‌వ‌చ్చు. దీంతో మిక్కిలి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. న‌ల్ల ఉప్పు నీళ్లు అంద‌రికీ ప‌డ‌క‌పోవ‌చ్చు. వీటిని తాగితే కొంద‌రికి విరేచ‌నాలు అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు వీటిని తాగ‌డం మంచిది.

Share
Editor

Recent Posts