Litchi Fruit : లిచీ పండ్ల సీజన్ వచ్చేసింది. ఈ సీజన్‌లో ఈ పండ్లను అసలు మిస్ కాకుండా తినండి. లిచీ చాలా తియ్యని రుచిని కలిగి ఉంటుంది. దీన్ని అందరూ ఇష్టంగా తింటారు. ఈ పండ్లు తినడం వల్ల మనకు అనేక అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. లిచీ పండ్లను తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఈ పండ్లు మేలు చేస్తాయి. ఈ పండ్లతో జ్యూస్‌లు, జెల్లీలు, శీతల పానీయాలను కూడా తయారు చేస్తారు. లిచీ పండ్లలో విటమిన్ సి, విటమిన్ డి, మెగ్నిషియం, రైబో ఫ్లేవిన్, కాపర్, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ సీజన్‌లో ఈ పండ్లను మిస్ చేయకుండా తినండి.
లిచీ పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఫైబర్ మన పొట్టను ఎక్కువ సమయం పాటు టైట్ గా ఉంచుతుంది. దీంతో మనం ఆహారం తక్కువగా తీసుకుంటాము. ఫలితంగా బరువు తగ్గడం సులభతరం అవుతుంది. ఈ పండ్లలో నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల అధిక బరువును ఇది ప్రోత్సహిస్తుంది. ఈ పండ్లను మీరు రోజులో ఏ సమయంలో అయినా తినవచ్చు.
లిచీ పండ్లు అందాన్ని కూడా అందిస్తాయి. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. వృద్ధాప్య చాయలు రాకుండా అడ్డుకుంటుంది. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. లిచీ పండ్లు రోగ నిరోధక వ్యవస్థకు సహాయం చేస్తాయి. దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ పవర్ వృద్ధి చెందుతుంది. లిచీ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది.
లిచీ పండ్లను తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఇలా లిచీ పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.