Bottle Gourd Juice For Cholesterol : దీన్ని రోజూ తాగితే చాలు.. ర‌క్త‌నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..!

Bottle Gourd Juice For Cholesterol : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాగే ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం, ర‌క్త‌స‌ర‌ఫ‌రా సాఫీగా సాగ‌క‌పోవ‌డం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంది. మ‌నం తీసుకునే ఆహారం కార‌ణంగా శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. అలాగే శ‌రీరంలో విష ప‌దార్థాలు, మ‌లినాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇవ‌న్నీ ర‌క్తంలో క‌లిసి క్ర‌మంగా ర‌క్తనాళాల‌ను మూసివేస్తున్నాయి. దీంతో హార్ట్ ఎటాక్ రావ‌డంతో పాటు 100 ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల కార‌ణంగా క్ర‌మంగా ర‌క్త‌స‌ర‌ఫ‌రా సాఫీగా సాగ‌దు. దీంతో శ‌రీరంలో ఉండే అవ‌య‌వాలు క్ర‌మంగా దెబ్బ‌తింటాయి.

అవ‌య‌వాలకు ర‌క్తం, ఆక్సిజ‌న్ స‌క్ర‌మంగా సాగ‌క అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ర‌క్త‌స‌ర‌ఫ‌రా సాఫీగా సాగ‌క‌పోవ‌డం వ‌ల్ల జుట్టు కూడా ఎక్కువ‌గా రాలుతుంది. కంటి చూపు త‌గ్గుతుంది. మెద‌డు పనితీరు త‌గ్గుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా సాఫీగా సాగ‌క పోవ‌డం వ‌ల్ల ఇలాంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక మ‌నం మ‌న ర‌క్త‌నాళాల‌ను ఎల్ల‌ప్పుడూ అడ్డంకులు లేకుండా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో ర‌క్తం శుభ్ర‌ప‌డ‌డంతో పాటు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. ఈ చ‌క్క‌టి చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం మ‌న ర‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకుల‌ను తొల‌గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం. ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌ను తొల‌గించి వాటిని శుభ్రంగా ఉంచే ఆ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Bottle Gourd Juice For Cholesterol how to make it
Bottle Gourd Juice For Cholesterol

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం సొర‌కాయ‌ను, కొత్తిమీర‌ను, పుదీనాను, తుల‌సి ఆకుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ సొర‌కాయలో జ్యూస్ లో 10 తుల‌సి ఆకుల‌ను, 10 రెమ్మ‌ల పుదీనాను, 10 రెమ్మ‌ల కొత్తిమీర‌ను వేసి మ‌రలా మెత్త‌గా జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న జ్యూస్ ను క్ర‌మం త‌ప్ప‌కుండా 6 నుండి 7 నెల‌ల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులన్నీ తొల‌గిపోతాయి. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణలో ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ కూడా క‌రిగిపోతుంది.

దీంతో మ‌నం అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ జ్యూస్ ను తాగ‌డంతో పాటు చ‌క్క‌టి ఆహార నియ‌మాల‌ను పాటించాలి. నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను, జంక్ ఫుడ్ ను త‌క్కువ‌గా తీసుకోవాలి. ఆహారంలో ప‌చ్చి కూర‌గాయ‌ల‌ను, పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే వారానికి ఒక‌సారి ఉప‌వాసం చేయాలి. ఈ విధంగా ఈ జ్యూస్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన అడ్డంకుల‌ను తొల‌గించుకోవ‌చ్చ‌ని అలాగే చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts