Cholesterol : ఒంట్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉందా.. వీటిని తినండి.. మొత్తం క్లీన్ అవుతుంది..!

Cholesterol : ఈ ఆధునిక ప్ర‌పంచంలో దాదాపు 80 శాతం మంది గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాగే గుండె పోటు వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణించే వారి సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇలా గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అధిక కొలెస్ట్రాల్. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ అలాగే అధికంగా కొలెస్ట్రాల్ చేర‌నంత వ‌ర‌కు మ‌న‌కు బాగానే ఉంటాం. కానీ ఒక్క‌సారి శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ( ఎల్ డి ఎల్) వ‌చ్చి చేరిందంటే మ‌న శ‌రీరంలో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. శ‌రీరంలో చేరిన ఈ చెడు కొలెస్ట్రాల్ కార‌ణంగా మ‌న ప్రాణాల‌కే ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంది. శ‌రీరంలో ఉన్న ఈ చెడు కొలెస్ట్రాల్ ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా తొల‌గించుకోవ‌డం చాలా అవ‌స‌రం.

మనం కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను చాలా సుల‌భంగా తగ్గించుకోవ‌చ్చు. ఈ ఆహార ప‌దార్థాలు ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంతో పాటు ర‌క్త‌నాళాల్లో కొవ్వు చేర‌కుండా చేస్తాయి. ర‌క్త‌నాళాల్లో కొవ్వు చేర‌కుండా చేయ‌డం వ‌ల్ల ర‌క్త నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. దీంతో హార్ట్ ఎటాక్ వంటి స‌మ‌స్య‌లు కూడా ఉండ‌వు. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. నారింజ పండ్లు అలాగే నిమ్మ జాతికి చెందిన పండ్ల‌న్ని గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజ పండ్లల్లో విట‌మిన్ ఎ, బి6, సి వంటివి పుష్క‌లంగా ఉంటాయి. దాంతో పాటు పొటాషియం, పోలైట్, ఫైబ‌ర్ వంటివి కూడా అధికంగా ఉంటాయి.

Cholesterol reducing tips in telugu take these foods
Cholesterol

పొటాషియం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. గుండెకు ర‌క్ష‌ణ క‌లుగుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా తొల‌గిపోతుంది. అలాగే రెడ్ వైన్ కూడా గుండెకు ఎంతో మేలు చేస్తుంద‌ని అనేక ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డించాయి. రెడ్ వైన్ ను తీసుకోవ‌డం వల్ల శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్ప‌టికి దీనిని మితంగా తీసుకోవాలి. తృణ ధాన్యాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా గుండెకు మేలు క‌లుగుతుంది. వీటిలో ఉండే పోష‌కాలు శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ పుష్క‌లంగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయం ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

అదేవిధంగా ఆలివ్ నూనెను వాడడం వ‌ల్ల కూడా శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఆలివ్ నూనెను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే ఓట్ మీల్ ను తీసుకున్నా కూడా శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. రెండు నెల‌ల పాటు ఓట్ మీల్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిల్లో 3 శాతం కొలెస్ట్రాల్ త‌గ్గాయ‌ని అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్లో 14 శాతం త‌గ్గాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. ఓట్ మీల్ లో ఉండే ఫైబ‌ర్, బీటా గ్లూకోన్ అధికంగా ఉండ‌డం వ‌ల్ల ఇది ఎల్ డి ఎల్ స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. అలాగే తేనె మ‌ధుర‌మైన రుచినే కాదు ఊబ‌కాయాన్ని త‌గ్గించి త‌క్కువ స‌మ‌యంలోఎక్కువ శ‌క్తిని అందిస్తుంది.

రోజూ ఉద‌యం పూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. తేనెలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించే పోష‌కాలు అధికంగా ఉంటాయి. క‌నుక తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి బ‌రువు కూడా త‌గ్గుతారు. ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న వారు ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గ‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts