హెల్త్ టిప్స్

Cinnamon And Lemon : రోజూ రెండు సార్లు ఈ డ్రింక్‌ను తాగండి చాలు.. ఎంత‌టి పొట్ట అయినా స‌రే క‌రిగిపోతుంది..!

Cinnamon And Lemon : చాలామంది, అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. నిజానికి సరైన బరువుని మెయింటెన్ చేస్తే, ఆరోగ్యంగా ఉండొచ్చు. బరువు ఎక్కువ వున్నా, తక్కువ వున్నా ఆరోగ్యానికి ఇబ్బంది. చాలామంది బరువు తగ్గడానికి, అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. మీరు కూడా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా..? అధిక బరువు సమస్య నుండి బయట పడాలని చూస్తున్నారా..? అయితే, ఇలా చేయాల్సిందే. సరైన జీవన విధానంని పాటించకపోవడం, జంక్ ఫుడ్ ని ఎక్కువ తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం ఇలా పలు కారణాల వలన, చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

అధిక బరువు సమస్య నుండి బయట పడాలని చూసేవాళ్ళు, ఇలా చేయడం మంచిది. ఇలా చేయడం వలన స్పీడ్ గా బరువు తగ్గడానికి అవుతుంది. కావాలంటే, ట్రై చేయండి. బరువు తగ్గడం నిజానికి పెద్ద సమస్యగా మారింది. ప్రతిరోజు అరగంట వ్యాయామం చేయడం, యోగ చేయడం తో పాటుగా ఈ డ్రింక్ ని తీసుకుంటే, కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గొచ్చు.

Cinnamon And Lemon drink for fat loss Cinnamon And Lemon drink for fat loss

ఉదయాన్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి 15 రోజులు ఈ డ్రింక్ ని తాగితే, చక్కటి ఫలితం ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి, రెండు గ్లాసులు నీళ్లు పోయాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్, రెండు అంగుళాల దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. తర్వాత అర స్పూన్ మిరియాలు కూడా వేసుకుని కచ్చాపచ్చాగా దంచాలి.

తర్వాత నిమ్మకాయలో సగాన్ని నాలుగు ముక్కలు కింద కట్ చేసి వేసి పది నిమిషాలు పాటు మరిగించుకోవాలి. ఈ నీటిని వడకట్టేసి, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి గోరువెచ్చగా తీసుకోవాలి. ఈ డ్రింక్ ని తాగితే, ఎక్స్ట్రా కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గడానికి కూడా అవుతుంది.

Admin

Recent Posts