Coconut Oil For Weight Loss : అధిక బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా..? అయితే కొబ్బ‌రినూనెను రోజూ ఇలా తీసుకోండి..!

Coconut Oil For Weight Loss : పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు అంద‌రూ కొబ్బ‌రినూనె లేదా గానుగ నుంచి తీసిన నూనెల‌నే నేరుగా వాడేవారు. అందువ‌ల్ల వారు ఇప్ప‌టికీ చాలా దృఢంగా ఉంటారు. చాలా క‌ష్ట‌ప‌డి మ‌రీ ప‌నిచేస్తారు. అప్ప‌టి వారు చాలా మంది ఇప్ప‌టికీ ఇకా ఉత్సాహంగానే ఉంటున్నారు. వారు తిన్న‌, తింటున్న ఆహార‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌న పెద్ద‌ల్లాగే మ‌నం కూడా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తినాలి. దీంతో మ‌నం బ‌లం ల‌భిస్తుంది. పోష‌కాలు అందుతాయి. తద్వారా ఎలాంటి రోగ‌ము మ‌న ద‌రి చేర‌దు. ఇక ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల విష‌యంలో కొబ్బ‌రినూనె ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు.

కొబ్బ‌రినూనెను మ‌న దేశంలో కేర‌ళ వాసులు ఎక్కువ‌గా వాడుతుంటారు. కేర‌ళ వాసులు చేసే వంట‌ల్లో ఎక్కువ‌గా కొబ్బ‌రినూనెనే ఉప‌యోగిస్తారు. ఇక కొన్ని ప్ర‌త్యేక‌మైన వంట‌కాల్లోనూ కొబ్బరినూనెను వాడుతారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం కొబ్బ‌రినూనె ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని అనేక ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. ఆయుర్వేద వైద్యులు ఏదైనా ప్ర‌త్యేక‌మైన చికిత్స చేయాలంటే కొబ్బ‌రినూనెను ఔష‌ధంగా వాడుతుంటారు.

Coconut Oil For Weight Loss how to take it for maximum effect
Coconut Oil For Weight Loss

ఇలా తీసుకోవాలి..

కొబ్బ‌రినూనెలో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. కొబ్బ‌రినూనెను రోజూ ఒక టీస్పూన్ మోతాదులో నేరుగా తీసుకోవ‌చ్చు. అయితే దీన్ని రాత్రి నిద్ర‌కు ముందు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీకు జీర్ణాశ‌యంలో అసౌక‌ర్యం ఏర్ప‌డి విరేచ‌నం అవ‌చ్చు. క‌నుక రాత్రి నిద్ర‌కు ముందు ఒక టీస్పూన్ కొబ్బ‌రి నూనెను తాగాలి. అయితే నేరుగా తాగ‌లేమ‌ని అనుకునేవారు దాన్ని పాల‌లో లేదా ఏదైనా స్మూతీలో, స‌లాడ్‌లో క‌లిపి తీసుకోవ‌చ్చు. ఇలా కొబ్బ‌రినూనెను రోజూ తీసుకున్నా కూడా ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి.

ముఖ్యంగా అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న వారికి కొబ్బ‌రినూనె గొప్ప వ‌ర‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా కొవ్వు త్వ‌ర‌గా క‌రుగుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇలా అధిక బ‌రువు త‌గ్గేందుకు కొబ్బ‌రినూనె ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

జీర్ణ‌వ్య‌వ‌స్థ క్లీన్ అవుతుంది..

అయితే కొబ్బరినూనె జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై కూడా ప్ర‌భావం చూపిస్తుంది. రాత్రి పూట గ‌న‌క దీన్ని తీసుకుంటే మ‌రుస‌టి రోజు ఉద‌యం సుఖ విరేచ‌నం అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య పూర్తిగా త‌గ్గుతుంది. అజీర్తి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపులో మంట ఉండ‌వు. కొబ్బ‌రినూనెలో యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి. క‌నుక జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే పురుగులు, సూక్ష్మ క్రిములు చ‌నిపోతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్రంగా మారుతుంది. ఇలా కొబ్బ‌రినూనెతో మ‌నం ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts