Foods To Reduce Cholesterol : జీవితంలో మీకు హార్ట్ స్ట్రోక్ రావ‌ద్దు అనుకుంటే రోజూ వీటిని తినండి..!

Foods To Reduce Cholesterol : ప్ర‌స్తుతం చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. ఇది సైలెంట్ కిల్ల‌ర్‌లా వస్తోంది. అప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్యంగా క‌నిపించిన వారు స‌డెన్‌గా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ స్ట్రోక్‌, ఎటాక్ బారిన ప‌డి వెంట‌నే చ‌నిపోతున్నారు. ఇందుకు కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం మాత్రం ప్ర‌ధాన కార‌మ‌ణ‌ని వైద్యులు చెబుతున్నారు. అందువ‌ల్ల ప్ర‌స్తుతం గుండె ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌డం అత్యంత ఆవ‌శ్య‌కం అయింది. అయితే రోజూ మనం తినే ఆహారంలో కొన్ని మార్పుల‌ను చేసుకుంటే చాలు. దీంతో అస‌లు జీవితంలో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. ఇక అందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు లేదా ఆకుకూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్ వ‌చ్చే చాన్స్ చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో తేలింది. ఆకుప‌చ్చ‌ని ఆకుకూర‌ల విష‌యానికి వ‌స్తే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది పాల‌కూర‌. అవును, అదే. పాల‌కూర‌ను సైంటిస్టులు సూప‌ర్ ఫుడ్‌గా చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో అనేక పోష‌క విలువ‌లు ఉంటాయి. ముఖ్యంగా ఫైబ‌ర్‌, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ స‌మృద్ధిగా ఉంటాయి. అలాగే ఫోలేట్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇవి హార్ట్ స్ట్రోక్ వ‌చ్చే అవ‌కాశాలను చాలా వ‌ర‌కు త‌గ్గిస్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక మ‌నం రోజువారీ ఆహారంలో పాల‌కూర‌ను భాగం చేసుకోవాలి. అయితే కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు మాత్రం పాల‌కూర‌కు దూరంగా ఉంటేనే మంచిది.

Foods To Reduce Cholesterol take these daily for many benefits
Foods To Reduce Cholesterol

2 క‌ప్పుల గ్రీన్ టీ..

ఇక రోజూ 2 క‌ప్పుల గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల కూడా హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. దీంతో ర‌క్త‌నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. క‌నుక రోజూ గ్రీన్ టీని తాగ‌డం మ‌రిచిపోకండి.

అలాగే అవ‌కాడోల‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవ‌చ్చు. వీటిల్లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తాయి. అలాగే వీటిల్లో పొటాషియం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. అందువ‌ల్ల అవ‌కాడోల‌ను త‌ర‌చూ తింటుంటే గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది.

బ్రోక‌లీ కూడా..

బ్రోక‌లీని కూడా మ‌నం ఆహారంలో భాగం చేసుకోవ‌చ్చు. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా సూప‌ర్ మార్కెట్ల‌లో ల‌భిస్తుంది. దీన్ని ప్ర‌స్తుతం చాలా మంది తింటున్నారు. బ్రోక‌లీలో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌తోపాటు ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇవ‌న్నీ మ‌న శ‌రీరంలోని కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. ఇలా ఈ ఆహారాల‌ను గ‌న‌క త‌ర‌చూ తింటున్న‌ట్ల‌యితే మీ గుండెకు శ్రీ‌రామ ర‌క్ష అని చెప్ప‌వ‌చ్చు. మీకు హార్ట్ ఎటాక్ వ‌చ్చే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి. క‌నుక వీటిని త‌ర‌చూ తిన‌డం మంచిది. దీంతో ఇత‌ర లాభాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts