కాఫీ.. డార్క్ చాకొలెట్.. ఈ రెండింటినీ జంక్ ఫుడ్ అని చాలా మంది భావిస్తారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. వీటిని రోజూ తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలనే అందిస్తాయి. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటితో మనక లాభాలు కలుగుతాయి. అయితే కాఫీ, డార్క్ చాకొలెట్.. రెండింటిలో ఆరోగ్యానికి దేంతో ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. కాఫీని తాగడం వల్ల పలు లాభాలు కలుగుతాయి. కాఫీలో ఉండే కెఫీన్ శక్తిని అందిస్తుంది. రోజూ కాఫీని తాగడం వల్ల పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాఫీని తాగితే మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మూడ్ మారుతుంది. అలర్ట్‌గా ఉంటారు. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు.
కాఫీని తాగడం వల్ల అడ్రినలిన్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో శారీరకంగా ఎక్కువ ప్రదర్శన చేస్తారు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాఫీలో పలు రకాల బి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం ఉంటాయి. ఇవి లివర్‌ను దెబ్బ తినకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా కాఫీతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది. ఇక డార్క్ చాకొలెట్‌లో ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నిషియం, కాపర్, ఇతర మినరల్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటితో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా డార్క్ చాకొలెట్ వల్ల ప్రయోజనాలు కలుగుతాయి.
ఇక కాఫీ, డార్క్ చాకొలెట్.. రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది ? అంటే.. న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం రెండూ ఆరోగ్యకరమైనవే. రెండూ దాదాపుగా సమానమైన లాభాలనే అందిస్తాయి. కాకపోతే వీటిని రోజూ తగిన మోతాదులోనే తీసుకోవాలి. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. అదే వీటిని ఎక్కువగా తీసుకుంటే లాభాలు కలగకపోగా అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఈ రెండింటిని మోతాదులో తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొంతదవచ్చు.