అరటి పండ్లు.. మనకు అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధర కలిగిన పండ్లలో ఒకటి. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. అయితే అరటి పండ్లను తినే విషయంలో చాలా మందికి పలు సందేహాలు కలుగుతుంటాయి. వాటిల్లో అందరికీ కలిగే సందేహం ఒక్కటే. అదేమిటంటే..
అరటి పండును భోజనం చేసిన తరువాత తినవచ్చా ? తింటే ఏమైనా నష్టాలు కలుగుతాయా ? అని సందేహిస్తుంటారు. అయితే దీనికి ఆయుర్వేదం ఏం చెబుతుందంటే..
అరటి పండ్లను తినేందుకు ఉత్తమమైన సమయం ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య అని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కూడా ఈ పండ్లను తినవచ్చు. కానీ సాయంత్రం, రాత్రి పూట అరటి పండ్లను తినరాదు
అరటి పండ్లను సాయంత్రం లేదా రాత్రి పూట తినడం వల్ల శరీరంలో మ్యూకస్ తయారవుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలను కలగజేస్తుంది. కనుక అరటి పండ్లను రాత్రి తినరాదు. ఉదయం లేదా మధ్యాహ్నం తినవచ్చు.