Cool Drinks : వేసవికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది కూల్ డ్రింక్స్ ను తాగుతూ ఉంటారు. ఏ కంపెనీ తయారు చేసిన కూల్ డ్రింక్ అయిన ఎటువంటి కూల్ డ్రింక్ అయిన మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మనందరికి తెలిసిందే. ఇవి మన ఆరోగ్యానికి హనిని కలిగిస్తాయని తెలిసినప్పటికి వీటిని తాగడం మాత్రం మానరు. నేటి తరుణంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ వీటిని తాగుతున్నారు. వీటిని తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. కూల్ డ్రింక్స్ లో కార్బోనేటెడ్ వాటర్, పంచదార, రసాయనాలు, హాని కలిగించే యాసిడ్లు, వివిధ రంగులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు పొట్టలో యాసిడ్ స్థాయిలు కూడా పెరుగుతాయి.
దీంతో మన శరీరం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతుంది. కూల్ డ్రింక్స్ ను తాగిన గంటలోపల అసలు మన శరీరంలో ఏం జరుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కూల్ డ్రింక్ ను తాగడం అంటే నేరుగా పంచదారను తినడమేనని నిపుణులు చెబుతున్నారు. 350 ఎమ్ ఎల్ కూల్ డ్రింక్ లో 35 నుండి 45 గ్రాముల పంచదార ఉంటుంది. వీటిని తాగిన వెంటనే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కొద్ది మొత్తంలో తీపి పదార్థాలను తింటేనే కడుపు నిండినట్టు ఉంటుంది. కానీ కూల్ డ్రింక్ లను తాగిన కూడా కడుపు నిండినట్టు ఉండదు. దీనికి కారణం వాటిల్లో ఫాస్పారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కూల్ డ్రింక్స్ లో ఉండే షుగర్ స్థాయిలను తగ్గిస్తుంది. కూల్ డ్రింక్స్ ను తాగడం వల్ల వీటిలో ఉండే షుగర్ శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. అలాగే కూల్ డ్రింక్స్ లో కెఫిన్ ఉంటుంది.
వీటిని తాగిన 40 నిమిషాల తరువాత ఈ కెఫిన్ ను శరీరం పూర్తిగా గ్రహిస్తుంది. దీంతో నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. అలాగే రక్తపోటు సమస్య కూడా తలెత్తుతుంది. కూల్ డ్రింక్స్ ను తాగిన 50 నిమిషాల తరువాత మెదడులో సంతోషాన్ని కలిగించే హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీంతో మనకు ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. ఇది డ్రగ్స్ తీసుకోవడం, ధూమపానం చేయడం, ఆల్కాహాల్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీంతో మన మెదడు పదేపదే కూల్ డ్రింక్ తాగమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. కూల్ డ్రింక్ తాగడం వల్ల మనం ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో శరీరం డీ హైడ్రేషన్ బారిన పడుతుంది. అలాగే శరీరం దానిలో ఉండే పోషకాలను కోత్పోతుంది. దీంతో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పోషకాలను కోల్పోవడం వల్ల కూల్ డ్రింక్స్ తాగిన గంట తరువాత శరీరం అలిసి పోయినట్టుగా అనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మన శరీరానికి ఎటువంటి మేలు కలగదు. పైగా దంతాలు, ఎముకలు గుళ్ల బారిపోతాయి. పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్, ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో ఫ్యాటీ లివర్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని తాగకపోవడమే మంచిది. వీటికి బదులుగా పండ్ల రసాలను, మజ్జిగను తాగడం ఉత్తమం.