Coriander Juice : కొత్తిమీర జ్యూస్‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Coriander Juice : మ‌నం వంట‌ల‌ను గార్నిష్ చేయ‌డానికి కొత్తిమీర‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. కొత్తిమీర వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంటలు చూడ‌డానికి అందంగా ఉండ‌డంతో పాటు మంచి వాస‌న కూడా వ‌స్తాయి. అలాగే కొత్తిమీర‌తో కొత్తిమీర చ‌ట్నీ, కొత్తిమీర రైస్ వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వంట‌ల్లో కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అయితే వంట‌ల్లో వాడ‌డానికి బ‌దులుగా దీనిని జ్యూస్ గా చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర జ్యూస్ ను తీసుకోవ‌డం వల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కొత్తిమీర జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శక్తి పెరుగుతుంది.

వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా చాలా మంది త‌రుచూ ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. అలాంటి వారు కొత్తిమీర జ్యూస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల గాయాలు, దెబ్బ‌లు త్వ‌ర‌గా మానుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. కంటి చూపు మెరుగుప‌డుతుంది. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. దీనిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌వ్య‌వ‌స్థను మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. కొత్తిమీర జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. అంతేకాకుండా కొత్తిమీర జ్యూస్ ను తీసుకోవ‌డం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Coriander Juice take it on empty stomach for many benefits
Coriander Juice

శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఈ జ్యూస్ ను తాగ‌డం వల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే కొత్తిమీర‌తో జ్యూస్ చేసి తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్త‌పోటు కూడా అదుపులో ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీర జ్యూస్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ ను ప‌ర‌గ‌డుపున ఒక క‌ప్పు మోతాదులో రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts